ఇమ్రాన్ అక్ర‌మ సంతానం భార‌త్‌లో..!

ఇమ్రాన్ అక్ర‌మ సంతానం భార‌త్‌లో..!

మ‌రే రాజ‌కీయ నాయ‌కుడికి క‌ల‌గ‌నంత క‌ష్టం పాకిస్థాన్ క్రికెట‌ర్ గా సుప‌రిచితుడు.. తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పాక్ కు ప్ర‌ధాని కావాల‌ని ఆశిస్తున్న ఆయ‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి కాకుండా మాజీ భార్య నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌నాస్త్రాల‌కు ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కొంత‌కాలం ఇమ్రాన్ తో క‌లిసి ఉండి.. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్న మాజీ భార్య రేహం ఖాన్ చేస్తున్న ఆరోప‌ణ‌లకు స‌మాధానాలు చెప్ప‌లేక ఇమ్రాన్ ఖాన్ తెగ ఇబ్బంది ప‌డుతున్నారు.
పాక్ లో ప్ర‌స్తుతం చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో విజ‌య అవ‌కాశాలు ఉన్న నేత‌గా ఇమ్రాన్ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఆయ‌న విజ‌యాల‌కు శాశ్వితంగా ఘోరీ క‌ట్టేలా మాజీ భార్య చేస్తున్న ఆరోప‌ణ‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇమ్రాన్ ఖాన్ కు ప‌లువురు మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాలు ఉన్న‌ట్లుగా గ‌తంలో ఆరోపించిన రేహం.. తాజాగా ఇమ్రాన్ అక్ర‌మ సంతానం భార‌త్ లో కొంద‌రు ఉన్న‌ట్లు చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు.

ఇమ్రాన్ కు ఐదుగురు అక్ర‌మ సంతానం ఉన్నార‌ని.. వారంతా భార‌త పౌరులుగా పెరుగుతున్నార‌ని ఆమె చెప్పారు. ఈ విష‌యాన్ని త‌న‌కు ఇమ్రానే స్వ‌యంగా చెప్పిన‌ట్లు ఆమె చెబుతున్నారు. భార‌త్ లో పెరుగుతున్న ఇమ్రాన్ అక్ర‌మ సంతానంలో పెద్ద సంతానం వ‌య‌సు 34 ఏళ్లు ఉంటుంద‌ని ఆమె వెల్ల‌డించారు.ఈ ఆరోప‌ణ రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు..ఆయ‌నను దెబ్బ తీసేలా చేస్తుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English