ఎన్నికల ముందు కేసీఆర్‌కు తలనొప్పి తెస్తున్న బాల్క సుమన్

ఎన్నికల ముందు కేసీఆర్‌కు తలనొప్పి తెస్తున్న బాల్క సుమన్

తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి కేసీఆర్ మనసు గెలుచుకుని ఎంపీ అయిన కుర్ర లీడర్ బాల్క సుమన్ ఇప్పుడు పార్టీకి నెత్తినొప్పులు తెస్తున్నట్లుగా కనిపిస్తోంది. లైగింపు వేధింపుల ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టడం..దీనిపై ఏకంగా ప్రధానికే ఫిర్యాదు వెళ్లడంతో పార్టీలో కొంత అలజడి కనిపిస్తోంది.

సంక్షేమ పథకాలు.. మిషన్ కాకతీయ, భగీరథ వంటివాటిని ముందుకు పెట్టి.. దానికి తన ఇమేజ్‌ను జోడించి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ సిద్ధమవుతున్నారు. టీఆరెస్ నేతల్లో కొందరు గతంలో రకరకాల ఆరోపణల్లో చిక్కుకున్నా వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపుగా సానుకూల వాతావరణం సృష్టించారు కేసీఆర్. ఇలాంటి సమయంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై ఏకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

కొందరు మహిళలను ఆయన లైంగికంగా వాడుకున్నారంటూ పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్, న్యాయవాదులు వీఎస్ రావు, ఎంఎస్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. . మే 31న సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఎం‌పీ అపార్ట్‌మెంట్‌కు ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు వచ్చి తనను బెదిరించారని ఎంపీ సహాయకుడు మర్రి సునీల్ గత నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి చొరబడిన వారు సుమన్ కోసం ఇల్లంతా వెతికారని, ఆయన లేరని చెప్పడంతో దుర్భాషలాడి వెళ్లారని, మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించి వెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి పేర్లను సంధ్య, విజేత, శంకర్‌, గోపాల్‌లుగా పేర్కొన్నారు. అయితే, సునీల్ చెబుతున్నట్టు సంధ్య, విజేతలు నిందితులు కాదని, ఆ ఇద్దరు మహిళలతో పాటు మరెందరో ఎంపీ చేతిలో లైంగిక దోపిడీకి గురైన బాధితులని పాత్రికేయులు మోదీకి రాసిన లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో మహిళా కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని, బాధితులను ఎంపీ, పోలీసుల బారి నుంచి కాపాడాలని కోరారు. అలాగే, కేసును సీబీఐకి అప్పగించి పూర్తి వివరాలు రాబట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు