మోడీ ఖాతాలో చేరిన ఇంకో మ‌ర‌క‌

మోడీ ఖాతాలో చేరిన ఇంకో మ‌ర‌క‌

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ‌చ్చే విమ‌ర్శ‌ల్లో మొద‌టిది ఆయ‌న విదేశీ టూర్ల గురించే. ఆయ‌న బాధ్యతలు చేపట్టి ఇటీవల నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ నాలుగేళ్ల‌ కాలంలో ఆయన ఎన్నో విదేశీ పర్యటనలు చేపట్టారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌పై  సంబంధించిన వివ‌రాల‌ను ఆర్టీఐ కింద ప్రభుత్వం వెల్ల‌డించింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా సామాజిక కార్యకర్త భీమప్ప అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాన మంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇదులో ఒకింత అవాక్క‌య్యే అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మోడీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. 2014 జూన్ 15-16 రెండు రోజుల కోసం రూ.2.45 కోట్ల‌ను ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. మోడీ పర్యటనలో అత్యల్పంగా ఖర్చు అయినది ఇదే కావడం విశేషం. నాలుగేళ్లలో ఇప్పటి వరకు మొత్తంగా 41 విదేశీ పర్యటనల్లో 52 దేశాలను సందర్శించారు. ఇందు కోసం రూ.355 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు చేసిందని లేఖలో పేర్కొంది. 48 నెలల పదవీకాలంలో 165రోజుల పాటు విదేశీ పర్యటనల్లో గడిపినట్లు పేర్కొంది. మూడు దేశాల పర్యటన నిమిత్తం తొమ్మిది రోజుల పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటన నిమిత్తం ప్రభుత్వం అత్యధికంగా రూ.31.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చు అయిన విదేశీ ప‌ర్య‌ట‌న ఇదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు