జగన్‌ భార్య ఆవేదన

జగన్‌ భార్య ఆవేదన

ఓ భార్యగా, ఓ తల్లిగా తాను ఎంత ఆవేదన చెందుతున్నారో ఆ ఆవేదనను లేఖ రూపంలో ప్రధానికి తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతి. జగన్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్న కాలంలో ఆయన ప్రజా ప్రతినిథిగా లేరని లేఖలో పేర్కొన్నారామె.

మే 27, 2012లో జగన్‌ని అరెస్టు చేశారని, ఏడాదిపాటు రిమాండు ఖైదీగా జగన్‌ని ఎలా ఉంచుతారని ప్రశ్నించారు భారతి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించిన ఏడాదికి జగన్‌పై ఆరోపణలు చేయడమేంటని భారతి నిలదీశారు. సిబిఐ తీరు జగన్‌ కేసు విషయంలో అనుమానాస్పదంగా ఉందని, ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు ఆమె.

రాజకీయాలలో ఇలాంటి లేఖలు వ్యక్తిగత ప్రతిష్ట, పబ్లిసిటీ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప, లేఖలకు పాలకులు స్పందించే పరిస్థితులైతే లేవిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English