ముద్రగడ గురించి మోహన్‌ బాబు ఏం చెప్పారు?

ముద్రగడ గురించి మోహన్‌ బాబు ఏం చెప్పారు?

బుధవారం ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ హీరో.. మంచు మోహన్‌ బాబుకు కుమారుడు విష్ణు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తమ అభిమాని ఇంట జరుగుతున్న పెళ్లికి విచ్చేసిన విష్ణు.. ఈ సందర్భంగా మద్రగడను కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడకు ఆయన గురించి తన తండ్రి మోహన్‌ బాబు చెప్పిన మాట ఆసక్తికరంగా మారింది.

కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి... ఆమరణ నిరాహార దీక్షతో ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన ముద్రగడ పద్మనాభం గురించి మోహన్‌ బాబు చేసిన వ్యాఖ్యల్ని విష్ణు ప్రస్తావించారు. టీవీల్లో ముద్రగడ చేసిన దీక్షను చూసి.. ముద్రగడ చాలా మొండివారని.. ఆయన ఏదైనా తలపెడితే అది పూర్తి అయ్యే వరకూ  విడిచి పెట్టరని తనకు చెప్పినట్లుగా విష్ణు వెల్లడించారు.

తాను పెళ్లికి వెళుతున్న సందర్భంలో.. అంత దూరం వెళుతున్నావు.. అక్కడ నుంచి కిర్లంపూడికి వెళ్లి అంకుల్‌ కు సంఘీభావం ప్రకటించాలని తన తండ్రి చెప్పారని విష్ణు అన్నారు. అయితే తాను ఫోన్‌ చేస్తే.. కాకినాడలో ఒక పెళ్లికి వస్తున్నట్లు ముద్రగడ గారే చెప్పారని.. అక్కడే కలుద్దామని ఆయన చెప్పటంతో తాను కలిసినట్లు విష్ణు వెల్లడించారు. కాస్తంత సినిమాటిక్‌ గా అనిపించినా.. ముద్రగడను అభిమానంగా కలిసిన విష్ణు ఉదంతంపై పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు