పవన్‌కళ్యాణ్‌ ఉన్నా నమ్మకం లేదు

పవన్‌కళ్యాణ్‌ ఉన్నా నమ్మకం లేదు

    వరుస హిట్లిచ్చిన చరిత్ర ఉన్న వెంకటేష్‌కి ఏనాడూ వరుస ఫ్లాపులిచ్చిన రికార్డు లేదు. అయితే 'తులసి' తర్వాత మరో హిట్‌ లేక వెంకటేష్‌ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో వెంకీ క్లారిటీ కోల్పోయాడు. ఇప్పటికే పలు సినిమాలు చేయాలని అనుకుని తర్వాత వెనక్కి తగ్గిన వెంకటేష్‌కి 'ఓ మై గాడ్‌' రీమేక్‌ మీద గురి కుదిరింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకోవడంతో కొంచెం క్రేజ్‌ వచ్చింది.

అయితే అది తెలుగులో హిట్‌ అవుతుందో లేదోననే నమ్మకం లేక కాస్త సెంటిమెంట్‌ జోడించాలని వెంకటేష్‌ కోరుకుంటున్నాడు. తనకి అచ్చివచ్చిన నయనతారని ఇందులో పెడితే తనకో హిట్‌ గ్యారెంటీ అని వెంకీ ఫీలౌతున్నాడు. కానీ నయనతార ఇందులో ప్రాధాన్యం లేని పాత్ర చేయడానికి ఇష్టపడట్లేదు. ఎంత ఖర్చయినా ఫర్లేదు కానీ నయనతార మనసు మార్చి ఈ సినిమాకి ఒప్పించమని అడుగుతున్నాడు. తన స్టార్‌డమ్‌ మీద నమ్మకం లేకపోతే పవన్‌కళ్యాణ్‌పై అయినా నమ్మకం పెట్టుకోవాలి కానీ... ఇలా హీరోయిన్‌ వెంట పడడమేంటని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు