అక్కినేని ఆ రేంజ్‌లో తిట్టేశారు

అక్కినేని ఆ రేంజ్‌లో తిట్టేశారు

                   ప్రస్తుతం దర్శకులెవరూ హీరోల కోసం కాని,  హీరోయిన్ల కోసం కాని సరైన రోల్స్‌ రాయడంలేదట. అన్నీ మూస ధోరణీలో రాస్తూ, హీరోలను చెత్త రోల్స్‌ చెయ్యాల్సిందా ఫోర్స్‌ చేస్తున్నారని ఆరోపించారు లెజండ్‌ అక్కినేని నాగేశ్వరరావు.
                    ఒక టివి ఛానల్‌లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న తరుణంలో డిబేట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లైవ్‌ షోలో పాలుపంచుకున్న అక్కినేని ఒక్కసారిగా తనలోని ఘోషను కాస్త బూతులు రంగరించి సందించారు. సామాజిక స్పృహలేని సినిమాల్లో ఎవరైనా నటించమంటే, విగ్గుతీసి ప్రక్కనపడేసి చెయ్యనుపోరా లం....కొ.. అని తిట్టేస్తానని చెప్పారు. అవాక్కయ్యారా.?? అవును అక్కినేని ఒక్కసారి కాదు, ఏకంగా నాలుగైదు సార్లు లం... అనే బూతును లైవ్‌లో వాడేశారు.
              పెద్దాయన మనస్సులోని ఆవేశం కట్టలుతెంచుకొని ఆ విధంగా బూతుల రూపంలో షికారు చేసిందనమాట. అయితే ఇదంతా లైవ్‌లో జరుగుతోంది కాబట్టి, యాంకర్‌ కూడా నోరువెల్లబెట్టి చూడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు