కన్నడలో జెండా పాతేస్తుందా?

కన్నడలో జెండా పాతేస్తుందా?

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా సక్సెస్‌ అయ్యే కాలం ఎప్పుడో చెల్లిపోయంది. ఇప్పుడు ఇక్కడంతా పరాబాషా తారలే. అందుకే మనోళ్ళు కూడా ప్రక్క రాష్ట్రాల్లో ఎటాక్‌ చేస్తున్నారు. బిందు మాధవి తమిళంలో, స్వాతి మలయాళంలో ఈ మధ్యనే సూపర్‌హిట్టులు కొట్టారు.
                    ఇక తెలుగులో ఎప్పటినుండో నెట్టుకురాలేక ఇబ్బందిపడుతున్న అర్చన శాస్త్రి ఎలియాస్‌ వేద, ఇప్పుడు కన్నడలో ఒక సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసింది. సాండల్‌వుడ్‌ మెగాస్టార్‌ పునీత్‌ రాజకుమార్‌ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. అయితే మోహన్‌లాల్‌ ప్రక్కన సరైనా జోడిగా ఉంటుందని అర్చనను ఓకె చేశారట యునిట్‌. కనిపించేది కొంచెంసేపేకాని, అది చాలా పవర్‌ఫుల్‌ రోల్‌ని, సింహా సినిమాలో నయనతార టైపులో ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాకనుక హిట్టయితే, మన పాప అక్కడ జెండా ఎగరెయ్యడం కాయమట.
   సర్లేండి ఇక్కడెలాగో ఛాన్సులు ఇవ్వకలేకపోతున్నాం, కనీసం అక్కడైనా సక్సెస్‌ కావాలని ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు