వరల్డ్ ఫేమస్ లవర్ పై ముప్ఫై కోట్ల భారం!

వరల్డ్ ఫేమస్ లవర్ పై ముప్ఫై కోట్ల భారం!

విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ చాల చిత్రంగా అనిపిస్తుంది. అతనిపై అయిదు కోట్ల బిజినెస్ లేనపుడు అర్జున్ రెడ్డి పాతిక కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. గీత గోవిందం చిత్రాన్ని పదిహేను కోట్లకు అమ్మితే డెబ్భై కోట్ల వరకు షేర్ వచ్చింది. తీరా అతని తదుపరి చిత్రాలు ఇరవై కోట్లను దాటడం గగనమైంది.

డియర్ కామ్రేడ్ చిత్రం ముప్పై అయిదు కోట్ల బిజినెస్ చేస్తే బయ్యర్లకి భారం అయింది. ఈసారి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని ముప్ఫై కోట్లకు విక్రయించడం జరిగింది. దీనిపై పెద్దగా బజ్ లేకపోయినా గాని విజయ్ దేవరకొండ పేరు మీద వసూళ్లు వస్తాయనే ఆశలున్నాయి. అతనికి యువతలో ఉన్న క్రేజ్ మీదే బెట్టింగ్ గట్టిగా జరిగింది.

ఈ సినిమాకి విజయ్ అసలు సరిగ్గా ప్రచారం చేయకపోయినా కానీ ఓపెనింగ్స్ కి ఢోకా ఉండదనే అనిపిస్తోంది. అయితే ముప్ఫై కోట్లు వసూలు చేయడం మాత్రం పూర్తిగా సినిమా కంటెంట్ పై ఆధారపడుతుంది. విజయ్ స్పీచ్ లు వింటే మాత్రం అంత నమ్మకం కలగడం లేదు గాని సంక్రాంతి తర్వాత ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు కనుక ఈ చిత్రానికి అడ్వాంటేజ్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English