ఎఫ్-2 చూశాక స్వార్థం పుట్టింది-మహేష్

ఎఫ్-2 చూశాక స్వార్థం పుట్టింది-మహేష్

'మహర్షి' తర్వాత మహేష్ బాబు చేయాల్సిన సినిమా సుకుమార్ దర్శకత్వంలోనిదే అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చి ఆరు నెలలకు పైగా సుకుమార్‌తో ప్రయాణం కూడా సాగించాడు మహేష్. కానీ ఉన్నట్లుండి పెద్ద బాంబు పేలింది. మహేష్ ఏమో అనిల్ రావిపూడితో సినిమాకు కమిటయ్యాడు. సుక్కు ఏమో మహేష్ స్థానాన్ని అల్లు అర్జున్‌తో రీప్లేస్ చేశాడు. మధ్యలో ఏం జరిగిందన్నది సస్పెన్స్. ఆ సస్పెన్స్ వెనుక అనిల్ రావిపూడి ఉన్నాడన్నది ఇంతకుముందే చూచాయిగా తెలిసింది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్లలో భాగంగా మధ్యలో ఏం జరిగిందో పూర్తిగా విప్పేశాడు మహేష్.

'మహర్షి' చేస్తున్న సమయంలోనే అనిల్ రావిపూడి తనను కలిసి 'సరిలేరు నీకెవ్వరు' నరేషన్ 40 నిమిషాల పాటు ఇచ్చాడని.. అప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యానని.. అప్పటికి తనకు ఓ కమిట్మెంట్ ఉండటతో తర్వాత సినిమా చేద్దామని అన్నానని మహేష్ తెలిపాడు. ఐతే తర్వాత తన ఇంట్లో సంక్రాంతికి 'ఎఫ్-2' స్పెషల్ షో వేసుకుని చూశానని.. అది చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నానని.. వెంకీ కామెడీ చూసి ఆశ్చర్యపోయానని.. అప్పుడే తాను స్వార్థంగా ఆలోచించి అనిల్‌తో తర్వాతి సినిమా చేయాలని ఫిక్సయిపోయానని మహేష్ తెలిపాడు.

అప్పుడే తనకు అనిల్ ''సరిలేరు..' ఫుల్ నరేషన్ ఇచ్చాడని, దీంతో ఆలస్యం చేయకుండా ఈ సినిమాను పట్టాలెక్కించానని మహేష్ వెల్లడించాడు. మరి మహేష్ ఇంత ఓపెన్‌గా అసలు విషయం చెబుతున్న నేపథ్యంలో ఈ మాటలకు సుకుమార్ ఎలా ఫీలవుతాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English