బ‌న్నీ ఇగో లెస్ డ్యాన్స్.. థియేట‌ర్లు బ‌ద్ద‌లే

బ‌న్నీ ఇగో లెస్ డ్యాన్స్.. థియేట‌ర్లు బ‌ద్ద‌లే

ఇంతకుముందు మన హీరోలు.. తమ పోటీదారుల విషయంలో స్పందించే తీరే వేరుగా ఉండేది. ఎక్కడా వాళ్ల పేర్లు ఎత్తడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. ఈ విషయంలో అందరిలోనూ ఇగో ఉండేది. కానీ ఈ మధ్య పరిస్థితులు మారాయి. ఒకరినొకరు ప్రశంసించడానికి.. ఒకరి వేడుకలకు ఒకరు రావడానికి.. సినిమాల్లో కూడా ఒకరి పేర్లు ఇంకొకరు ప్రస్తావించడానికి.. రెఫరెన్సులు పెట్టడానికి వెనుకాడట్లేదు.

వేరే హీరోల అభిమానులు కూడా సినిమాలు చూస్తేనే వసూళ్లు పెరుగుతాయి.. పాజిటివిటీ వచ్చి సినిమాలకు మేలు జరుగుతుందని ఇలా చేస్తున్నారు మన హీరోలు. ఈ విషయంలో అల్లు అర్జున్ అందరినీ దాటి ముందుకు వెళ్లిపోయాడు 'అల వైకుంఠపురములో' సినిమాతో. ఈ చిత్రంలో సెకండాఫ్‌లో వచ్చే ఒక ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది.

ఒక సన్నివేశంలో బన్నీ.. వేరే హీరోల పాటలకు డ్యాన్సుల స్టెప్పులేసే ఎపిసోడ్ మామూలుగా పేలలేదు. ముందుగా మహేష్ పాట 'వచ్చాడయ్యో స్వామీ'కి బన్నీ స్టెప్పులేయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత 'ఐ వానా ఫాలో ఫాలో..' అంటూ 'నాన్నకు ప్రేమతో' పాటకు తారక్ తరహాలోనే స్టెప్పులేస్తాడు. తర్వాత 'ఉండిపోరాదే..' పాట వస్తుంది. ఆపై సునీల్ లైన్లోకి వచ్చి ఇన్ని పాటలకు స్టెప్పులేశావ్..  మా పవన్ కళ్యాణ్ పాటకు వెయ్యవా అని అడిగితే.. 'గబ్బర్ సింగ్'లోని పిల్లా నువ్వు లేని జీవితం పాటకు అచ్చం పవన్‌లాగా స్టెప్పులేసి ఇరగదీస్తాడు బన్నీ.

సునీల్‌ కూడా అతడి మంచి సహకారమే అందించాడు. ఇవన్నీ అయ్యాక విలన్ని ఒక దెబ్బ కొట్టి 'అబ్బనీ తీయని దెబ్బ' పాటకు స్టెప్ వేసి పెద్దాయన పాట లేకుంటే ఎట్లా అంటూ ఆ ఎపిసోడ్‌కు పరిపూర్ణత్వం తీసుకొచ్చాడు. ఈ ఎపిసోడ్ నడుస్తున్నంతసేపూ థియేటర్లలో రచ్చ మామూలుగా లేదు. దీంతో పాటు రాములో రాములా పాట సమయంలోనూ థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. బన్నీ ఇగోలెస్ డ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద డిస్కషనే నడుస్తోంది. ఈ ఎపిసోడ్‌తో బన్నీ అందరు హీరోల అభిమానుల మనసుల్నీ గెలిచేశాడు ఒకేసారి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English