హార్దిక్ పాండ్యపై నెటిజన్ల ఏడుపు

హార్దిక్ పాండ్యపై నెటిజన్ల ఏడుపు

ఇండిమాలో సినిమా, క్రికెట్.. ఈ రెండింట్లో ఎందులో విజయవంతం అయినా జీవితం మారిపోతుంది. అతి సామాన్యులు కూడా కొన్నేళ్లలోనే ఊహించని స్థాయికి చేరుకుంటారు. లైఫ్ స్టైల్ మార్చేస్తుంటారు. ఐతే స్టైల్ ఎంత మార్చినా కూడా కొంతమందిలో మాత్రం రఫ్ లుక్ మారదు. వాళ్లు ఊర మాస్‌గానే కనిపిస్తారు. ఏ స్థాయికి చేరినా గల్లీ బాయ్స్ లాగే ఉంటారు. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఈ కోవకే చెందుతాడు.

బరోడాకు చెందిన ఈ కుర్రాడు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతను..  చాలా తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యాడు. టీమ్ ఇండియాలోకి కూడా వచ్చేశాడు. ఐపీఎల్‌లో అతడికి దాదాపు పది కోట్ల రేటు పలుకుతుండటం విశేషం. భారత జట్టు ఆటగాడిగా కూడా బాగానే ఆర్జిస్తున్నాడు. మోడలింగ్, ఇతర వాణిజ్య ఒప్పందాలతో కూడా బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు.

మంచి ఫేమ్ సంపాదించి.. రెండు చేతులా ఆర్జిస్తున్న ఆటగాడితో ప్రేమాయణం నడపడానికి అమ్మాయిలు లైన్లో ఉండకుండా ఎలా ఉంటారు. మనోడి క్రేజ్ చూసి నటాషా అనే ఫారిన్ బ్యూటీ ఫిదా అయిపోయింది. అతడితో డేటింగ్‌కు సై అంది. కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగాక ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ముందు ఈ అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ అంటూ నూతన సంవత్సరాది రోజు పరిచయం చేసిన హార్దిక్.. ఆ తర్వాతి రోజే ఆమెకు సముద్రం మధ్యలో రింగ్ తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరిగే అవకాశముంది.

ఐతే నటాషాతో కలిసి హార్దిక్ దిగిన ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు మాత్రం అతడి అదృష్టానికి తట్టుకోలేకపోతున్నారు. హార్దిక్ సగటు మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తుంటే.. అతడి పక్కన చాలా పోష్‌గా ఉన్న నటాషాను చూసి అదృష్టమంటే నీదే బాబూ.. డబ్బులుంటే ఎలాంటి అమ్మాయిలైనా పడిపోతారనడానికి ఇది రుజువు అంటూ చాలామంది కుర్ర నెటిజన్లు హార్దిక్ మీద ఏడుస్తూ రకరకాల మీమ్స్ పెడుతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English