థియేట‌ర్లో సినిమా.. రోడ్డుపై పైర‌సీ సీడీ.. హీరో హార్ట్ బ్రేక్

థియేట‌ర్లో సినిమా.. రోడ్డుపై పైర‌సీ సీడీ.. హీరో హార్ట్ బ్రేక్

తెలుగు సినిమాల పైర‌సీని నియంత్రించేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఇటు సినిమా వాళ్లు.. అటు పోలీసు అధికారులు ఎన్నో మాట‌లు చెప్పారు. ఎన్నో చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా పైర‌సీని నియంత్రించ‌డం మాత్రం సాధ్యం కావ‌డం లేదు.

పైర‌సీ వెబ్ సైట్ల‌ను ఎంత‌గా నియంత్రిస్తున్న‌ప్ప‌టికీ.. కొత్త సినిమా రిలీజైన రోజు రాత్రికే ఎక్క‌డో ఒక చోట పైర‌సీ వెర్ష‌న్ బ‌య‌టికి వ‌చ్చేస్తోంది. సీడీ షాపుల్లోనే కాదు.. రోడ్ల మీద పెట్టి కారు చౌక‌గా  పైర‌సీ సీడీలు అమ్మేస్తున్నారు. వీటి గురించి సినిమా వాళ్లు వార్త‌ల రూపంలో తెలుసుకుంటూ ఉంటారు త‌ప్ప‌.. నేరుగా వారికి అనుభ‌వాలు ఎదుర‌వ‌డం అరుదు.

ఐతే యువ క‌థానాయ‌కుడు నిఖిల్ సిద్దార్థ‌కు ఇలాంటి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. త‌న కొత్త చిత్రం అర్జున్ సుర‌వ‌రం విజ‌య‌యాత్ర‌లో భాగంగా నిఖిల్ ఆంధ్రా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరులో సినిమా ఆడుతున్న థియేట‌ర్లో ప్రేక్ష‌కుల్ని క‌లిసి.. ఆ త‌ర్వాత మ‌రో ప్రాంతానికి వెళ్తుండ‌గా.. టీ తాగ‌డం కోసం రోడ్డు ప‌క్క‌న కారు ఆపాడు నిఖిల్.

ఐతే అక్క‌డ ఓ మ‌హిళ పైర‌సీ సీడీలు అమ్ముతుండ‌టం.. అందులో త‌న సినిమా కూడా ఉండ‌టంతో అత‌ను షాక‌య్యాడు. మూడు సినిమాలు క‌లిపి రూ.40కే ఇస్తుండ‌టం మ‌రింత విస్మ‌యానికి గురి చేసింది. దీనిపై నిఖిల్ ఒక వీడియో పోస్ట్ చేశాడు.

సీడీలు అమ్ముతున్న త‌న దీన స్థితి గురించి, కుటుంబం గురించి మాట్లాడుతోంద‌ని.. కానీ సినిమా వాళ్ల‌కు కూడా కుటుంబాలుంటాయ‌ని.. వాళ్ల క‌డుపులు కొట్ట‌డం స‌రి కాద‌ని.. పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌ని నిఖిల్ ఆవేద‌న పూర్వ‌కంగా విజ్న‌ప్తి చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English