ఈ రేంజ్‌ బాదుడేంటి బాసూ

ఈ రేంజ్‌ బాదుడేంటి బాసూ

బాలీవుడ్‌లో మిడ్‌ రేంజ్‌ యాక్టర్లకి పీడ కలలు తెప్పిస్తున్నాడు ఆయుష్మాన్‌ ఖురానా. హిట్టు మీద హిట్లు కొడుతోన్న ఆయుష్మాన్‌ ఖురానా తాజా చిత్రం 'బాలా' కూడా బాక్సాఫీస్‌ దుమ్ము రేపుతోంది. నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మార్కు దాటిన ఈ చిత్రం కూడా అతని గత చిత్రం 'డ్రీమ్‌గాళ్‌' మాదిరిగా వంద కోట్ల మార్కుని అవలీలగా దాటేస్తుందని తేలిపోయింది. అతని విజయ పరంపర చూసి నిర్మాతలంతా ఆయుష్మాన్‌ వెంట పడుతున్నారు. దీంతో మిగతా మధ్య శ్రేణి హీరోలకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. వారిలో ఎవరూ కూడా ఖురానా మాదిరిగా నిలకడ చూపించలేకపోతున్నారు. చివరకు అగ్ర హీరోల సినిమాలకి కూడా లాభాలు చాలా స్వల్పంగానే వస్తున్నాయి. ఎక్కడో ఒకటీ అరా తప్ప పెద్ద సినిమాలకి డబ్బులు మిగలడం లేదు. దీంతో ఖురానా చిత్రాల కోసమే బయ్యర్లు ఎగబడుతున్నారు.

చాపకింద నీరులా విస్తరించిన ఆయుష్మాన్‌ ఖురానా ఇప్పటికీ తనని తాను స్టార్‌లా చూసుకోడు. సగటు మధ్య తరగతి యువకుల సమస్యలపై ఫోకస్‌ చేసే సినిమాలే చేస్తున్నాడు. అదే అతని విజయ రహస్యంగా మారింది. ఖురానా నటించాడంటే తప్పకుండా ఆ చిత్రంలో విషయం వుంటుందనే ఫీలింగ్‌ బాలీవుడ్‌ ఆడియన్స్‌లో బలపడింది. అతని రీమేక్‌ చిత్రాల హక్కుల కోసం తెలుగు హీరోలు కూడా క్యూ కడుతూ వుండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English