అల వైకుంఠపురం కూడా బ్రేక్‌ ఇవ్వదట

అల వైకుంఠపురం కూడా బ్రేక్‌ ఇవ్వదట

ఒకప్పుడు స్టార్‌ కమెడియన్‌గా వెలిగి, డెయిలీ పారితోషికంలో అత్యధిక మొత్తం అందుకున్న సునీల్‌ ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. అదే సమయంలో చాలా మంది కొత్త కమెడియన్లు పుట్టుకొచ్చారు. సునీల్‌ స్థాయికి ఎదగలేకపోయినా కానీ తమదైన ముద్ర వేసారు. మునుపటిలా కమెడియన్లకి భారీ పారితోషికాలు రావడం లేదు. కాంపిటీషన్‌ పెరగడంతో పేరొచ్చిన వాళ్లు కూడా హెవీగా డిమాండ్‌ చేయడం లేదు.

ఇలాంటి టైమ్‌లో తిరిగి కామెడీ స్టార్ట్‌ చేసిన సునీల్‌ తనని గతంలో స్టార్‌ని చేసిన త్రివిక్రమ్‌ ఈసారి కూడా బ్రేక్‌ ఇస్తాడని ఆశిస్తున్నాడు. 'అరవింద సమేత'లో సునీల్‌ కామెడీ చేసినా కానీ అది ఎవరికీ గుర్తుండేలా లేకపోవడంతో అది ఏమాత్రం హెల్ప్‌ అవలేదు. దాంతో 'అల వైకుంఠపురములో' అయినా తనకి మంచి పాత్ర దక్కుతుందని ఆశించాడు. కానీ ఇండస్ట్రీ టాక్‌ని బట్టి ఇందులో కూడా సునీల్‌ పాత్ర మామూలుగానే వుంటుంది తప్ప అంతగా హైలైట్‌ ఏమీ అవదట.

ఈ చిత్రంలో చాలా మంది ఆర్టిస్టులని పెట్టడంతో హీరోకి మినహా మిగిలిన ఎవరికీ ఎక్కువ లెంగ్త్‌ వున్న రోల్‌ లేదని అంటున్నారు. అంటే సునీల్‌కి మరోసారి ఆశాభంగం అయినట్టే అనుకోవాలి. ఇదిలావుంటే తన పాత్ర స్నేహాలని బట్టి సునీల్‌ అందరినీ అవకాశాల కోసం వెంబడిస్తున్నాడట. కానీ సునీల్‌కి ఖచ్చితంగా ప్లేస్‌ ఇవ్వాలని ఎక్కువ మంది ప్రయత్నించడం లేదట. స్ట్రాంగ్‌ జోన్‌ని వదిలేసి కొన్ని రోజులు ఎటైనా వెళితే ఏమవుతుందనే దానికిదే ఉదాహరణ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English