సునీల్‌ రాత మార్చేది ఇదే!

సునీల్‌ రాత మార్చేది ఇదే!

హీరో పాత్రలు మానేసి మళ్లీ కమెడియన్‌గా క్లిక్‌ అవడం కోసం సునీల్‌ కష్టపడి తెచ్చుకున్న సిక్స్‌ ప్యాక్‌ బాడీని కూడా త్యాగం చేసేసాడు. మళ్లీ విపరీతంగా ఒళ్లు చేసి మునుపటి స్వరూపంలోనే ప్రేక్షకులని నవ్వించాలని చూస్తున్నాడు. కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి త్రివిక్రమ్‌ సినిమాని ఎంచుకున్నా కానీ ఆశించిన ఫలితం రాలేదు. 'అరవింద సమేత' చిత్రంతో సునీల్‌కి బ్రేక్‌ రాలేదు. ఆ తర్వాత ఒక రెండు, మూడు చిత్రాల్లో కనిపించినా కానీ సునీల్‌కి కమెడియన్‌గా మునుపటి వైభవం తెచ్చే క్యారెక్టర్‌ పడలేదు. ఆ లోటుని 'చిత్రలహరి'లో పాత్ర తీరుస్తుందని అంటున్నారు.

ఇందులో సాయి ధరమ్‌ తేజ్‌ స్నేహితుడిగా సునీల్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషించాడు. గతంలో హీరో సైడ్‌ కిక్‌గా సునీల్‌ ఎంతగా క్లిక్‌ అయ్యాడనేది తెలిసిందే. మళ్లీ అలాంటి పాత్రని సునీల్‌ ఇందులో చేసాడు. ఈ క్యారెక్టర్‌ కోసం సునీల్‌ని ఏరి కోరి ఎంచుకున్న దర్శకుడు కిషోర్‌ తిరుమల అతనికి సూపర్‌ డైలాగులు రాసాడట. ఈ సినిమా విడుదలయ్యాక మళ్లీ కమెడియన్‌గా సూపర్‌ బిజీ అయిపోతాననే ధీమాని సునీల్‌ కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్‌ కోసం హీరో, దర్శకుడి కంటే కూడా సునీలే ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు అని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English