అవును.. అది మన్మథుడు-2నే

అవును.. అది మన్మథుడు-2నే

ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయిన 'మన్మథుడు' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయం ఈ రోజు అధికారికంగా ధ్రువీకరణ అయింది. ఈ సినిమాకు టైటిల్ కూడా 'మన్మథుడు-2' అనే పెడుతున్నారు. సోమవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
'మన్మథుడు-2' అనేది వర్కింగ్ టైటిల్ అని.. పక్కాగా ఇది 'మన్మథుడు' సీక్వెల్ కాకపోవచ్చని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటికి తెరదించుతూ 'మన్మథుడు-2' టైటిల్‌ను ప్రారంభోత్సవం రోజే అనౌన్స్ చేసేశారు. ఇక ఈ చిత్రా కాస్ట్ అండ్ క్రూ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. నాగార్జున సరసన కథానాయికగా రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. అందులో రకుల్ పేరే ఖరారైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య సరసన రకుల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

గతంలో ఏఎన్నార్ సరసన నటించిన శ్రీదేవితో జత కట్టిన నాగ్.. ఇప్పుడు కొడుకు హీరోయిన్‌తో రొమాన్స్ చేయబోతుండటం విశేషమే. చిరు సైతం చరణ్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్‌తో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఇక 'మన్మథుడు'తో అద్భుతమైన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పని చేయట్లేదు. 'ఆర్ఎక్స్ 100'తో మెప్పించిన చేతన్ భరద్వాజ్ 'మన్మథుడు-2'కి సంగీతం సమకూరుస్తున్నాడు.

నాగార్జున ఎప్పుడూ సినిమాలు నిర్మించే 'అన్నపూర్ణ స్టూడియోస్'లో కాకుండా 'మనం ఎంటర్‌ప్రైజెస్'లో 'మన్మథుడు-2' చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ అధినేత జెమిని కిరణ్ కూడా ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి కానున్నాడు. ప్రారంభోత్సవంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. తర్వాత బ్రేక్ తీసుకుని ఏప్రిల్ 12 నుంచి ఫారిన్ షెడ్యూల్ మొదలుపెడతారట. కొన్ని రోజులుగా లుక్ పరంగా కొంచెం తేడాగా కనిపిస్తున్న నాగ్.. 'మన్మథుడు' పాత్ర అనేసరికి మళ్లీ అందంగా తయారై ప్రారంభోత్సవంలో పాల్గొనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English