రామ్‌ చరణ్‌ సైలెంట్‌ మోడ్‌

రామ్‌ చరణ్‌ సైలెంట్‌ మోడ్‌

పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల బరిలోకి దిగితే మెగా ఫ్యామిలీ హీరోలెవరూ వచ్చి ప్రచారం చేయడం లేదు. గతంలో బాబాయ్‌ పిలిస్తే వెళతానని చెప్పిన చరణ్‌ ఇప్పుడు కనీసం బాబాయ్‌ కోసం సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కూడా వేయడం లేదు. నాగబాబు ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు కాబట్టి వరుణ్‌ తేజ్‌ ఒక్కడే డైరెక్ట్‌ సపోర్ట్‌ ఇస్తున్నాడు. మిగతా మెగా హీరోలు మాత్రం మిగిలిన హీరోల మాదిరిగానే సైలెన్స్‌ పాటిస్తున్నారు.

ఎవరు ఎలా వున్నా చరణ్‌ నుంచి స్పందన లేకపోవడం పవన్‌ అభిమానులకి ఇబ్బందిగా వుంది. చరణ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ల కింద రెస్పాన్స్‌, రిప్లయిస్‌లో ఆ అసహనం కనిపిస్తోంది. చూస్తోంటే చిరు, చరణ్‌ ఈ ఎన్నికలకి పూర్తిగా దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారనిపిస్తోంది. చరణ్‌ తన బాబాయ్‌కి సపోర్ట్‌ ఇవ్వకపోవడం మాత్రం పవర్‌ అభిమానులకి కోపం తెప్పిస్తోంది. మరి ఈ వేడి చూసి అయినా చరణ్‌ త్వరలో స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English