ఫ్యాషన్ డోస్ పెంచిన మెగా వైఫ్‌

ఫ్యాషన్ డోస్ పెంచిన మెగా వైఫ్‌

ఎందుకు చేస్తున్నారు అంటే ఎవ్వరూ చెప్పలేరు కాని, ఆవిడ ఏం చేస్తున్నారు అంటే మాత్రం ఇట్టే చెప్పేయొచ్చు. మెగా హీరో రామ్ చరణ్‌ అర్ధాంగిగా ఉపాసన కామినేని బాగా పాపులర్ అయ్యింది. అయితే తనదైన శైలి బిజినెస్ ఉమెన్ టాక్స్ తో చాలామంది అభిమానులను కూడా సంపాదించింది. అయితే హెల్త్, లేదంటే ఫుడ్, అప్పుడప్పుడూ రామ్ చరణ్‌ గురించి న్యూస్.. షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది.

అయితే ఇప్పుడు సడన్ గా ఉపాసన తనలోని మరో యాంగిల్ కూడా చూపిస్తోంది. ఈ మధ్యన ఈనాడు పేపర్ కోసం ఒక ఇంటర్యూ ఇచ్చిన ఉపాసన, ఆ పేపర్లో వేసిన ఫోటోల్లో చాలా స్టయిలష్ గా కనిపించింది. ఎందుకంటే చాలాపెద్ద ఫ్యాషన్ డిజైనర్ ఇచ్చిన డ్రస్సుల్లో కొత్త సొగసులు ఆరబోస్తూ  చాలా స్పయిసీగా కనిపించిందనే చెప్పాలి. మన హీరోల భార్యల్లో మాజీ హీరోయిన్లు తప్పించి, నార్మల్ భామలు ఎవరూ ఇంత స్టయిలిష్ గా కనిపించరు. అందుకే ఉపాసన లుక్స్ సడన్ గా తళ్ళుక్కుమంటూ చూపరులను ఆకర్షించాయి.

కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, సడన్ గా తన ఫ్యాషన్ డోస్ ను పెంచేసి ఉపాసన ఏం చేద్దమాని అనుకుంటుంది అని ఎవ్వరికైనా అనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఇలా తనని తాము బ్రాండ్ చేసుకుంటూనే పాపులార్టీ పెరుగుతుంది. పైగా ఈరోజుల్లో పాపులార్టీ ఈజ్ ఎవ్రీ థింగ్. అందుకే.. సమంత వంటి స్టార్ హీరోయిన్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్న లూయిస్ వ్యూటన్ అనే పర్సుల బ్రాండ్.. ఉపాసనకు కూడా బ్రాండింగ్ యాడ్స్ ఇచ్చింది మరి!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English