బోయపాటిని దూరం పెట్టిన అల్లు అర్జున్‌?

బోయపాటిని దూరం పెట్టిన అల్లు అర్జున్‌?

'వినయ విధేయ రామ' చిత్రంతో దర్శకుడిగా తనపై వున్న గౌరవాన్ని, నమ్మకాన్ని చాలా మంది దగ్గర పోగొట్టుకున్నాడు బోయపాటి శ్రీను. కథ లేదా కథనం కుదరక సినిమాలు ఫ్లాపయితే పట్టించుకోరు కానీ మరీ దారుణమైన సన్నివేశాలతో నింపేయడమే కాకుండా, సపోర్టింగ్‌ ఆర్టిస్టులతో ఓవరాక్షన్‌ చేయించి, భరింతలేనంత ఘోరంగా సినిమా తీసిన బోయపాటి శ్రీను మళ్లీ తన ఉనికి చాటుకునే సినిమా తీస్తే మునుపటి స్టార్‌ స్టేటస్‌ అందుకునే వీల్లేదు. దీనికి తోడు తాను తీసిన చిత్రానికి బాధ్యత వహిస్తూ బయ్యర్ల నష్టాన్ని కాస్త భరించడానికి కూడా అతను ముందుకు రాకపోవడం ఇండస్ట్రీలో బోయపాటి రెప్యుటేషన్‌ని మరింత దెబ్బ తీసింది.

ఇప్పటికే అతనికి అడ్వాన్సులు ఇచ్చిన కొందరు వెనక్కి ఇమ్మంటూ వుంటే తనతో సినిమా చేద్దామనుకుంటోన్న హీరోలు ఒక్కొక్కరే డ్రాప్‌ అవుతున్నారు. గీతా ఆర్ట్స్‌లో బోయపాటికి 'సరైనోడు' టైమ్‌లో ఇచ్చిన అడ్వాన్స్‌ అలాగే వుంది. చిరంజీవి లేదా అల్లు అర్జున్‌తో ఆ సినిమా చేద్దామనుకున్నారు కానీ చిరంజీవి చేసే అవకాశాలు లేవని తేలిపోయింది. అల్లు అర్జున్‌ కూడా సుముఖంగా లేడనేది తాజా సమాచారం. బోయపాటి ఒక రెండు హిట్స్‌ తీసి మళ్లీ మునుపటిలా మాస్‌ పల్స్‌ పట్టుకున్నట్టయితే అప్పుడు మనసు మార్చుకునే ఛాన్స్‌ వుంటుందట. లేదంటే గీతా ఆర్ట్స్‌ కూడా అడ్వాన్స్‌ వెనక్కి ఇచ్చేయమని అడగవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English