సంక్రాంతి సినిమాలన్నీ కాపీ కథలే

సంక్రాంతి సినిమాలన్నీ కాపీ కథలే

కొత్త కథలు ఎక్కడ్నుంచో పుట్టుకు రావు... పాత కథలని తిరగరాయాల్సిందేనని సినీ రచయితలు పలు సందర్భాలలో చెప్పారు. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌ అయితే తాను రాసిన ప్రతి కథకీ ఒక పాత సినిమా రిఫరెన్స్‌ వుందని అంటారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి కథలు కాపీ కొడితే ఇట్టే దొరికిపోవడంతో పాటు కాపీ రైట్స్‌ తలకాయ నొప్పులు కూడా పడాల్సి వస్తుంది. అదే పాత సినిమాలనే అటు తిప్పి, ఇటు తిప్పి తీస్తే కొత్తగా వచ్చే సినిమాలన్నీ ఎక్కడో చూసినట్టుగానే అనిపిస్తుంటాయి కనుక ఇవి కూడా ఎలాంటి హక్కుల గోల లేకుండా చెల్లిపోతుంటాయి.

మొన్న సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలని తీసుకుంటే... ప్రతి దానికీ ఒక రిఫరెన్సు లేదా ఇన్‌స్పిరేషన్‌ వుంది. బ్లాక్‌బస్టర్‌ అయిన ఎఫ్‌2 చిత్రాన్ని 'గుండమ్మ కథ' ఫార్మాట్‌లో రాసుకున్నారు. నిశితంగా గమనిస్తే ఆ సంగతి తేటతెల్లమవుతుంది. 'వినయ విధేయ రామ'కి 'గ్యాంగ్‌లీడర్‌' స్ఫూర్తి. ఎఫ్‌2కి కుదిరిన రీ-వంటకం దీనికి కుదర్లేదు, అంతే! ఇక 'పేట' అయితే 'బాషా' అని ఈజీగా అర్థమవుతుంది. 'ఎన్టీఆర్‌'ది బయోపిక్‌ అయినా కానీ కథనం, చిత్ర గమనంలో 'మహానటి' స్ఫూర్తిని దాచి పెట్టడం వీలు కాలేదు. మొత్తానికి గుండమ్మ కథని ఇన్నేళ్ల తర్వాత కూడా సరిగ్గా మళ్లీ తీస్తే 'ఎఫ్‌ 2'లాంటి భారీ హిట్‌ కొట్టవచ్చునన్నమాట. రచయితలకి, దర్శకులకి వాటిని మళ్లీ తెలివిగా తీసే నేర్పు వుండాలంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English