అంతరిక్షంపై 2.0 ఎఫెక్ట్‌!

అంతరిక్షంపై 2.0 ఎఫెక్ట్‌!

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు మిగిలిన వాటి మధ్య ప్రత్యేకంగా అనిపిస్తాయనే దాంట్లో సందేహం లేదు కానీ, సైన్స్‌తో కూడిన విశేషాలని అర్బన్‌ ఆడియన్స్‌ ఆదరించినంతగా రూరల్‌ ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేయరు. అందుకే ఈ తరహా చిత్రాలని తక్కువ బడ్జెట్‌లో కానిచ్చేస్తుంటారు.

భారీ బడ్జెట్‌ అయినట్టయితే సినిమా బాగున్నా రికవరీ కష్టమవుతుందని 2.0తో మరోసారి రుజువైంది. 2.0 చిత్రానికి ఆంధ్ర, సీడెడ్‌ ప్రాంతాల్లో మిశ్రమ స్పందన రావడంతో 'అంతరిక్షం' చిత్రంపై బయ్యర్లు డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన పోటీలో విడుదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రం ఆంధ్ర హక్కులు తీసుకున్న బయ్యర్‌ లాస్ట్‌ మినిట్‌లో తన వల్ల కాదంటూ తప్పుకున్నాడు. ఇప్పుడు మరో బయ్యర్‌ని వెతుక్కునే తలపోటు దేనికని స్వయంగా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. 2.0 నైజాంలో హిట్‌ అవడంతో అంతరిక్షంకి నైజాంలో క్రేజ్‌ బాగుంది.

కానీ ఆంధ్ర, సీడెడ్‌ ప్రాంతాల్లో మాత్రం దీనికి స్పందన ఎలా వుంటుందనే దానిపై ట్రేడ్‌ వర్గాలకి కూడా ఇంకా ఐడియా లేదు. కెజిఎఫ్‌, పడి పడి లేచె మనసు చిత్రాలతో పోటీ తీవ్రంగా వుండే నేపథ్యంలో భారీ రేట్లు పెడితే తిరిగి రాదనేది బయ్యర్ల భయం కాబోలు. కొత్త తరహా చిత్రాలని కాస్త ఎక్కువ బడ్జెట్‌తో తీయాలంటే వ్యాపార పరంగా ఇలాంటి సమస్యలే వచ్చి పడుతుంటాయి. నిర్మాత పూర్తిగా తన డబ్బునే రిస్క్‌ చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలు బయటకి రావు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English