తమన్నా పనైపోయింది అంటేనే ఇష్టం

తమన్నా పనైపోయింది అంటేనే ఇష్టం

మామూలుగా జనాలు ఒక హీరోయిన్ పనైపోయింది అని అంటే.. అదే మాట ఆ కథానాయిక దగ్గర అంటే కోపం వస్తుంది. కానీ తమన్నా మాత్రం ఈ మాటను తేలిగ్గా తీసుకుంటోంది. తన గురించి ఆ మాట అంటే ఇష్టం అంటోంది. ఒకప్పుడు తమన్నా సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇటు తెలుగులో.. అటు తమిళంలో వరుసగా భారీ చిత్రాలు చేస్తూ.. పెద్ద పెద్ద స్టార్ల సరసన కనిపిస్తూ సందడి చేసేది. కానీ గత రెండు మూడేళ్లలో ఆమె జోరు బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా 'బాహుబలి' లాంటి సినిమా చేశాక తమన్నా కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుందని అనుకుంటే.. కథ అడ్డం తిరిగింది. ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

ఇప్పుడు తమన్నా చిన్నా చితకా సినిమాలు చేస్తోంది. ఫ్లాప్ హీరో సందీప్ కిషన్ సరసన నటిస్తోందంటే ఆమె రేంజ్ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తమన్నా పనైపోయిందన్న కామెంట్లు బాగా ఊపందుకున్నాయి. ఇదే మాట తమన్నా దగ్గర అంటే.. తనకు అలాంటి కామెంట్లు చాలా ఇష్టం అంటోంది.

"తమన్నా పని అయిపోయింది' అంటుంటే నాకు  ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అలా అన్నప్పుడుల్లా నాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తుంటాయి. మరింత స్ఫూర్తితో పనిచేయడానికి నాకు వీలు కలుగుతుంది. ఇలాంటి కామెంట్లను నేను సానుకూలంగానే తీసుకుంటాం. నన్ను కేవలం ఓ కథానాయికగానే చూడడం లేదు. అంతకు మించిన స్థానం ఇస్తున్నారు. నాకు డ్యాన్స్‌ చేయడం అంటే ఇష్టం. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది నృత్యాలే. ఇప్పటికీ 'వానా వానా' పాట గురించి చాలామంది గొప్పగా చెబుతుంటారు. అందుకే నాలుగు పాటలున్న రొటీన్‌ నాయిక పాత్రల్నీ ఇష్టపడుతుంటా. 'తమన్నా ఇలాక్కూడా ఉంటుంది. ఇలాంటి పాత్రలూ చేస్తుంది' అని నిరూపించుకోవడానికి కొత్త తరహా పాత్రలవైపు దృష్టిసారిస్తుంటా. ఆ క్రమంలో నా జోరు కొంచెం తగ్గి ఉండొచ్చు. అంతమాత్రాన నా పనైపోయినట్లు కాదు'' అని తమన్నా అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English