శ్రీదేవి కూతురు గీత దాటుతోంది

శ్రీదేవి కూతురు గీత దాటుతోంది

మొదటి సినిమాలో గ్లామర్‌ విందుకి ఆస్కారం లేకపోవడంతో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ చాలా పద్ధతిగా కనిపించింది. అయితే బయట ఎక్కడ కనిపించినా కానీ లేటెస్ట్‌ ట్రెండ్స్‌కి తగ్గట్టుగా డ్రస్‌ చేసుకుని ఫోటోగ్రాఫర్లకి పని చెప్పే జాన్వీ తన తొలి చిత్రం హీరో ఇషాన్‌ కత్తర్‌తో అవసరానికి మించి చనువుగా వుంటోంది. ఆ చిత్రం షూటింగ్‌ టైమ్‌లోనే ఇద్దరూ ఒకరి చెయ్యి విడిచి ఒకరు వుండలేనంత క్లోజ్‌గా కనిపించారు. అప్పుడంటే సినిమా ప్రమోషన్‌ కోసం అనుకోవచ్చు. కానీ ధడక్‌ విడుదలై థియేటర్ల నుంచి వెళ్లిపోయాక కూడా ఇంకా ఇద్దరూ అతుక్కుపోయి కనిపిస్తున్నారు.

బ్రా కనిపించేలా తన డెనిమ్‌ జాకెట్‌ బటన్స్‌ తీసేసి కూర్చున్న జాన్వీ ఒడిలో ఇషాన్‌ పడుకుని వున్న ఫోటో ఒకటి అతనే ఇంటర్నెట్‌లో పెట్టాడు. ఇదేదో ఫోటో షూట్‌ కోసం చేసినది కూడా కాదు. ఖచ్చితంగా మీడియా అటెన్షన్‌ రాబడుతుందనే ఉద్దేశంతోనే చేసిందని క్లియర్‌గా తెలుస్తోంది. మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్‌ వేయలేకపోయిన జాన్వి ఇలా సెన్సేషన్స్‌ ద్వారా వార్తల్లో వుండాలని చూస్తోందా? లేక ఇంకా మెచ్యూరిటీ రాని ఆకతాయితనమేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English