నాగచైతన్య కాదు.. నయనతార

నాగచైతన్య కాదు.. నయనతార

నెల ముందే 'శైలజారెడ్డి అల్లుడు' రిలీజ్ డేట్ ఫిక్సయింది. అప్పట్నుంచి చక్కగా ప్రమోషన్లు చేసకుంటూ వస్తున్నారు. పోస్టర్లు, టీజర్, పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా చేసుకుంటూ సాగారు. మరికొన్ని రోజుల్లోనే సెన్సార్ కూడా అనుకున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ అంతలో పెద్ద షాక్. కేరళలో వరదల కారణంగా సంగీత దర్శకుడు గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పని పూర్తి చేయలేకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చిత్ర బృందానికి తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. మంచి డేట్ మిస్ చేసుకుందా టీం.


ఐతే 'శైలజా రెడ్డి అల్లుడు' ఖాళీ చేసిన డేటుకి వెంటనే ఓ సినిమా కర్చీఫ్ వేసేసింది. ఐతే అది తెలుగు సినిమా కాదు. తమిళ డబ్బింగ్ మూవీ. ఈ నెల 17న తమిళంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నయనతార సినిమా ‘కోలమావు కోకిల’ 31న తెలుగులో విడుదల కానుంది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ ఈ చిత్రానికి మూడు రోజుల్లోనే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. నయన్ స్టార్ పవరేంటో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.  నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.  ‘మయూరి’.. ‘కర్తవ్యం’ సినిమాల మాదిరే ఇది కూడా తెలుగులోనూ విజయవంతమవుతుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు