ప్రమాదంలో ఉన్న ఆ పెద్ద సినిమా ఏది?

ప్రమాదంలో ఉన్న ఆ పెద్ద సినిమా ఏది?

కోట్లు ఖర్చు పెట్టి.. వందల మంది వందల రోజులు కష్టపడి సినిమా తీస్తే.. విడుదలకు ముందే సన్నివేశాలు లీక్ అయిపోతే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ‘అత్తారింటికి దారేది’ సహా కొన్ని సినిమాల విషయంలో కొన్ని సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. తాజాగా ‘గీత గోవిందం’కు కూడా ఆ బెడద తప్పలేదు. ఈ చిత్రానికి ఎడిటింగ్ విభాగంలో పని చేసిన ఒక వ్యక్తి చేసిన నిర్వాకానికి ఇందులోని చాలా సీన్లు లీక్ అయ్యాయి. అతను ఒక స్టూడెంటుకి ఆ సన్నివేశాల్ని షేర్ చేస్తే.. అతను మరింత మందికి షేర్ చేసి అవి సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అయ్యాయి. దీని గురించి ‘గీత గోవిందం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పైరసీని వ్యాప్తి చేసే వాళ్లకు తీవ్ర హెచ్చరికలే జారీ చేశాడు.

అదే సమయంలో ఇండస్ట్రీని కూడా ఆయన హెచ్చరించాడు. ఇది ఇండస్ట్రీ సిగ్గు పడాల్సిన విషయమన్నాడు. ‘గీత గోవిందం’ మాత్రమే కాక.. ఇంకో మూడు సినిమాలు కూడా లీకేజీ ప్రమాదంలో ఉన్నట్లు ఆయన వెల్లడించడం గమనార్హం. అందులో ఒక పెద్ద సినిమా కూడా ఉందన్నాడు. ఆయన మాట్ల్ని బట్టి చూస్తే ‘గీత గోవిందం’ను లీక్ చేసిన వ్యక్తే.. వేరే సినిమాల నుంచి కూడా ఎడిటింగ్ టైంలో సన్నివేశాల్ని కాపీ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఆ పెద్ద సినిమా సహా మూడు చిత్రాల నుంచి సన్నివేశాలు బయటికి వెళ్లాయా.. వాటి కథేంటి అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకీ అరవింద్ చెబుతున్న పెద్ద సినిమా ఏది అంటూ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇలాంటి ఇంటి దొంగల విషయంలో ఇండస్ట్రీ జనాలు ఇకపై జాగ్రత్తగా లేకుంటే పెద్ద ప్రమాదాలు తప్పవని ‘గీత గోవిందం’ ఉదంతం రుజువు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు