బన్నీ కావాలంటే యాసిడ్ పోసేస్తా

బన్నీ కావాలంటే యాసిడ్ పోసేస్తా

‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవర్‌ను rnఇప్పటికీ వదిలించుకోకుండా తనకే సొంతమైన ప్రత్యేకమైన యాటిట్యూడ్‌తో జనాల్ని rnఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అతను మైక్ rnపట్టుకున్నాడంటే అందరూ కళ్లు, చెవులు విప్పార్చుకుని అతడి వైపు చూస్తారు ఏంrn చేస్తాడో.. ఏం మాట్లాడతాడో అని. సంచలన వ్యాఖ్యలకు అతను కేరాఫ్ అడ్రస్ rnఅయిపోయాడు. అతడితో కలిసి సినిమా చేసేసరికి హీరోయిన్ రష్మిక మంధానకు కూడా rnఅదే యాటిట్యూడ్ అలవాటైనట్లుగా ఉంది. ‘గీత గోవిందం’ ఆడియో వేడుకలో ఆమె తన rnప్రసంగాన్ని మొదలు పెడుతూ పెడుతూ చేసిన వ్యాఖ్యలు అందరికీ పెద్ద షాకే rnఇచ్చాయి.


రష్మిక ప్రసంగం ఆరంభిస్తూ.. ‘‘బన్నీ గారు ఇక్కడ వచ్చి rnమాట్లాడాలని తెలుసు. కానీ 2 నిమిషాలు నేను మాట్లాడతా’’ అంది. ఐతే జనాలు rnమాత్రం బన్నీతో పాటు చిత్ర హీరో విజయ్ దేవరకొండ కోసం నినాదాలు చేశారు. rnదీంతో రష్మిక..  ‘‘ఇంకొక్కసారి రౌడీ కావాలి.. బన్నీ గారు కావాలి అని చెబితేrn యాసిడ్ పోసేస్తా’’ అంటూ వార్నింగ్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో బన్నీ, rnవిజయ్ సహా ఆడిటోరియంలో అందరూ గొల్లుమన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని rnకొనసాగిస్తూ.. ‘గీత గోవిందం’ సినిమా తనకెంత స్పెషలో చెప్పింది రష్మిక. rnదర్శకుడు పరశురామ్‌తో పాటు అందరికీ థ్యాంక్స్ చెప్పిన రష్మిక.. ఈ rnచిత్రాన్ని థియేటర్లోనే చూడాలని.. అప్పుడే మంచి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి.. ఈrn విషయంలో జనాల నుంచి కన్ఫర్మేషన్ కూడా తీసుకుందామె. ఇక ‘గీత గోవిందం’ rnట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ.. గోవిందం ఇంకా ఏమీ rnమారలేదని.. ఇంకా ఇరిటేటింగ్‌, అన్నాయింగ్‌గానే ఉన్నాడని చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు