నాని రాంగ్‌ స్టెప్‌ వేసాడా?

నాని రాంగ్‌ స్టెప్‌ వేసాడా?

వరుస విజయాలతో దూసుకుపోతూ తన స్టార్‌డమ్‌ పెంచుకుంటోన్న నానికి బిగ్‌బాస్‌ హోస్ట్‌ అవతారం ప్లస్‌ అవుతుందనే అభిమానులు, శ్రేయోభిలాషులు భావించారు. స్టార్‌ హీరోలందరినీ కాదని స్టార్‌ మా ఈ బాధ్యత నానికి ఇవ్వడం ఆశ్చర్య పరిచినా కొత్త బాధ్యతని నాని బాగానే మోస్తున్నాడు. అయితే ఈ క్రమంలో నాని పట్ల ఎన్నడూ లేని వ్యతిరేకత సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. ఇంతకాలం అందరికీ నచ్చిన హీరోగా, యాంటీ ఫాన్స్‌ లేని నానికి ఇప్పుడు వ్యతిరేకులు తయారయ్యారు. అతడిని ట్రాల్‌ చేసే వాళ్లు బాగా పెరిగారు. దానికి తోడు నాని కూడా ఇంటర్నెట్‌ ట్రాల్స్‌కి పలుమార్లు క్లాసులు పీకుతున్నాడు.

మామూలుగా అయితే నానికి ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కొన్ని సమస్యలు ప్రస్తావించక తప్పట్లేదు. ట్రాల్స్‌ని కంట్రోల్‌లో వుంచడానికి బడా హీరోలకి అభిమాన గణం వుంటుంది. పవన్‌, మహేష్‌, తారక్‌ లాంటి హీరోల మీద కంటిన్యూస్‌గా ట్రాలింగ్‌ కుదరదు. ఎందుకంటే వాళ్ల ఫాన్స్‌ ఎదురు దాడి మొదలు పెట్టేస్తారు.

నానిని అభిమానించే వాళ్లు వుంటారు కానీ అలా సైన్యంలా కాపాడే వాళ్లు ఎవరూ వుండరు. బిగ్‌బాస్‌ షోతో ఈ యాంటీ ఫాన్స్‌ గోల వదిలిపోతే ఫర్వాలేదు కానీ ఒకవేళ వీళ్లు తర్వాత నాని సినిమాలని కూడా టార్గెట్‌ చేయడం స్టార్ట్‌ చేస్తే మాత్రం తలనొప్పే. నాని అయితే తనపై జరిగే దాడిని సైలెంట్‌గా భరించే టైప్‌ కాదని పలుమార్లు తేలిపోయింది కనుక తనకొచ్చిన ఈ సమస్యకి అతనెలా ఫుల్‌స్టాప్‌ పెడతాడనేది ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు