మనోహరి మళ్లీ వస్తోంది

మనోహరి మళ్లీ వస్తోంది

బాహుబలి-1లో మనోహరి పాట ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో వయ్యారమైన నాట్యంతో ఆకట్టుకున్న ముగ్గురు సుందరాంగుల్లో ఒకరు స్కార్లెట్ విల్సన్. ఈ బ్రిటిష్ అందం నెమ్మదిగా తెలుగు సినిమాల్లో ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకునేలానే కనిపిస్తోంది.

స్కార్లెట్ విల్సన్ మరోసారి ఐటం సాంగుతో మెరిపించడానికి రెడీ అయిపోతోంది. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న డ్రైవర్ రాముడు సినిమాలో ఓ ఐటం సాంగు చేయడానికి ఓకే చెప్పింది. ఈ సినిమా డైరెక్టర్ రాజ్ సత్య ఇంతకుముందు స్కార్లెట్ విల్సన్ చేసిన ఐటం సాంగులకు తెగ ఇంప్రెస్ అయిపోయాడట. అందులో ఆమె డ్యాన్స్ మూమెంట్లకు ఫిదా అయ్యి తన సినిమాలో ఐటం సాంగు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట. ఐటం సాంగులు తనకు పేరు.. డబ్బులు రెండూ తెచ్చిపెడుతుండటంతో వద్దనకుండా ఓకే చెప్పేసింది.

స్కార్లెట్ విల్సన్ తొలిసారిగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జర్రమొచ్చింది పాటలో కనిపించింది. ఆ తరవాత ఎవడు సినిమాలో అయ్యో పాపం పాటలో రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేసింది. తాజాగా మోహన్ బాబు సినిమా గాయత్రిలోనూ ఓ ఐటం సాంగ్ చేసింది. ఇప్పుడు షకలక శంకర్ సినిమాలో తన టాలెంట్ మరోసారి చూపించడానికి రెడీ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు