దిల్ రాజు నాలుగు సినిమాలు.. ఏది ఎప్పుడు?

దిల్ రాజు నాలుగు సినిమాలు.. ఏది ఎప్పుడు?

టాలీవుడ్ బడా బేనర్లలో ‘శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్’ ఒకటి. దిల్ రాజు నుంచి ఒక సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. హీరో హీరోయిన్లెవరు.. దర్శకుడెవరుఅని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు. అదీ ఆయనకున్న క్రెడిబిలిటీ. ఆయన బేనర్రలో తెరకెక్కే సినిమాల రిలీజ్ డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగే రాజు.. చాలా ముందుగానే తన సినిమాల రిలీజ్ డేట్లు ఇచ్చేసి.. డెడ్ లైన్ అందుకునే దిశగా పని చేస్తుంటాడు. ఈ శుక్రవారం ఆయన బేనర్ నుంచి ‘లవర్’ సినిమా రాబోతోంది. దీని తర్వాత రాజు నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. వాటి రిలీజ్ డేట్లను చాలా ముందే ప్రకటించేశాడు.

‘లవర్’ తర్వాత రాజు నుంచి రాబోయే సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. నితిన్-రాశి ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 9న రిలీజ్ చేయబోతున్నట్లు రాజు ప్రకటించాడు. దీని తర్వాత దసరా కానుకగా రామ్-త్రినాథ రావుల ‘హలో గురూ ప్రేమ కోసమే’ను అక్టోబరు 18న రిలీజ్ చేయబోతున్నట్లు రాజు తెలిపాడు. ఆ తర్వాత రాజు సంక్రాంతి రేసులో దూకబోతున్నాడు. విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’ 2019 జనవరి 12న విడుదలవుతుందట. ఆపై రాజు కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ అనదగ్గ మహేష్-వంశీ పైడిపల్లి చిత్రం వచ్చే వేసవికి విడులవుతుంది. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని రాజు ప్రకటించాడు.

మొత్తానికి ‘లవర్’ లాంటి చిన్న సినిమాతో మొదలుపెట్టి.. రేంజ్ పెంచుకుంటూ వెళ్లి చివరగా మహేష్ బాబుతో చేస్తున్న మెగా ప్రాజెక్టును రిలీజ్ చేయబోతున్నాడు రాజు. పోయినేడాది ఆరు సినిమాలతో పలకరించిన రాజు.. ఈ ఏడాది మూడు సినిమాలకే పరిమితం అవుతున్నాడు. అవి చిన్న-మీడియం రేంజ్ సినిమాలే. కానీ వచ్చే ఏడాది మాత్రం తన బేనర్ నుంచి భారీ సినిమాలు.. అవి కూడా నాలుగు దాకా రిలీజవుతాయని రాజు ప్రకటించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు