పిక్ టాక్: డోస్ పెంచిన అమల

పిక్ టాక్: డోస్ పెంచిన అమల

కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ కెరీర్ మొదటి నుంచి గ్లామరస్ రోల్స్ కన్నా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలే లభించాయి. తెలుగులో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన నాయక్ సినిమాలోనే కాస్తంత గ్లామర్ ఒలకబోసింది. కెరీర్ మంచి జోరుగా ఉండగానే తమిళ డైరెక్టర్ ను విజయ్ ను పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఇద్దరికీ సరిపడకపోవడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టి నటించడం మొదలుపెట్టినా అమలా పాల్ కు పెద్దగా ఆఫర్లమీ రాలేదు. పెళ్లికి ముందు ధనుష్ తో నటించిన వి.ఐ.పి. (తెలుగులో రఘువరన్ బి.టెక్) సీక్వెల్ తీయడంతో దానిలో నటించింది. అది తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఛాన్సులేమీ దక్కించుకోలేక పోయింది. దీంతో రూటు మార్చింది. తనలోని గ్లామర్ యాంగిల్ చూపించాలని ఆరాటపడుతోంది. అందుకే ఈ మధ్య హాట్ ఫొజులతో ఓ ఫొటో షూట్ చేసింది.

పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నప్పటికీ తనలో గ్లామర్ యాంగిల్ ఏ మాత్రమూ తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఫొటో షూట్ చేసిందనే విషయం ఈజీగానే అర్ధమైపోతోంది. ఎందుకంటే ఆమె కెరీర్ లో ఎప్పుడూ ఈ రేంజిలో అందాలు ఆరబోయలేదు. గ్లామర్ రోల్స్ లో స్కిన్ షోకు రెడీగా ఉన్నానని అమలా పాల్ తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ పెంచిన డోస్ ను చూసి.. ఇప్పటికైనా దర్శక-నిర్మాతలు ఆమెను పట్టించుకుంటారో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు