చిరు అల్లుడే నష్టం భరిస్తాడా?

చిరు అల్లుడే నష్టం భరిస్తాడా?

ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలుండగా.. ఇప్పుడు ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తెరంగేట్రం చేశాడు. అతడి తొలి సినిమాను వారాహి చలనచిత్రం లాంటి పెద్ద సంస్థ నిర్మించింది. దీనికి సెటప్ అంతా బాగానే కుదిరిందని అనుకున్నారు కానీ.. ఈ చిత్రానికి ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.

గత గురువారం విడుదలైన ‘విజేత’ పూర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. దీనికి టాక్ కూడా పేలవంగా వచ్చింది. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా రాజీ లేకుండా నిర్మించే సాయి కొర్రపాటి.. ఈ చిత్రానికి కూడా అదే రూటు ఫాలో అయ్యాడు. ఏకంగా ఏడు కోట్ల బడ్జెట్ పెట్టాడు. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీకి ఛాయాగ్రహణం అందించిన సెంథిల్ కుమార్‌ను కెమెరామన్‌గా పెట్టుకున్నాడంటేనే ఖర్చు ఎంత అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

‘విజేత’కు ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయింది. దీంతో చాలా వరకు సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఐతే ఈ చిత్రం పెట్టుబడిలో ఇప్పటిదాకా పదో వంతు మాత్రమే వసూలు చేసింది. ఫుల్ రన్లో కోటి రూపాయల షేర్ కూడా వసూలయ్యేలా కనిపించడం లేదు. వెనక్కి వచ్చిన మొత్తం పబ్లిసిటీ ఖర్చులకే సరిపోతోంది. దాదాపుగా పెట్టుబడి మొత్తం నష్టపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సాయి చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు. కుంగిపోయి ఉన్నాడు. ఇప్పుడీ భారం భరించడం కష్టమే. ఐతే ఈ సినిమా సాయికి అప్పగించేటపుడే ఏమైనా తేడా వస్తే తమ వంతు సాయం ఉంటుందని చిరు-కళ్యాణ్‌ల నుంచి హామీ అందినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కళ్యాణ్ ఈ చిత్ర నష్టాల్ని భరించే అవకాశం ఉందని అంటున్నారు. పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన కళ్యాణ్‌కు ఇదేమంత బర్డెన్ కాకపోవచ్చని చెబుతున్నారు. మరి కళ్యాణ్ ఏ మేరకు సాయిని ఆదుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు