బెల్లంకొండని ఓవర్‌ ఎస్టిమేట్‌ చేస్తున్నారు

బెల్లంకొండని ఓవర్‌ ఎస్టిమేట్‌ చేస్తున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్‌కి మాస్‌ హీరోగా అంతో ఇంతో పేరయితే వచ్చింది కానీ పెద్ద సినిమాలని నడిపించే సత్తా అయితే లేదని 'జయ జానకీ నాయక'తో ప్రూవ్‌ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రానికి తొలి రోజు చాలా మంచి టాక్‌ వచ్చింది. మాస్‌ ప్రేక్షకులు మెచ్చే మసాలాలతో నిండిన ఆ చిత్రానికి హీరోనే మైనస్‌ అయ్యాడని తర్వాత విశ్లేషకులు తేల్చేయడం జరిగింది. ఎన్టీఆర్‌, ప్రభాస్‌లాంటి హీరో వుంటే సీన్‌ వేరేలా వుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కేవలం తన టాలెంట్‌తో సినిమాని నడిపించే సత్తా తనకుందని ఇంతవరకు బెల్లంకొండ శ్రీనివాస్‌ నిరూపించుకోలేదు. కానీ ఎందుకో అతడిని నిర్మాతలు ఓవర్‌ ఎస్టిమేట్‌ చేస్తున్నారు. సాక్ష్యం చిత్రంపై దాదాపు నలభై కోట్లు రిస్కులో వున్నాయట. సినిమాకి హిట్‌ టాక్‌ వచ్చినా అతను అంత రాబడతాడా అనేది తెలీదు. మిగతా వాళ్లు అతడిని ఒక కాంపిటీషన్‌గానే చూడడం లేదు.

సాక్ష్యం రిలీజ్‌ వుందని తెలిసినా కూడా అదే రోజున చి.ల.సౌ చిత్రంతో పాటు హ్యాపీ వెడ్డింగ్‌ రిలీజ్‌ అవుతున్నాయి. ఇవి రెండూ సిటీస్‌ సినిమాలే అయినప్పటికీ ఒక పెద్ద సినిమా రిలీజ్‌ అవుతోందనే భయం అయితే లేదని దీంతో తేలిపోయింది. మరోవైపు తేజ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమాకి శ్రీనివాస్‌కి అయిదు కోట్ల పారితోషికం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. హీరోగా ఇంతవరకు తనేంటో నిరూపించుకోని నటుడిపై ఇంత భారీ పెట్టుబడి ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. భారీ సినిమాలతో శ్రీనివాస్‌కి ఒక ఫేక్‌ ఇమేజ్‌నయితే సృష్టించగలిగారనేది మాత్రం ఇది తెలియజేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English