ప్రమోషన్లలో ఆ పిల్ల లెక్కే వేరు

ప్రమోషన్లలో ఆ పిల్ల లెక్కే వేరు

బిగ్ బాస్ సీజన్ 2 నెమ్మదిగా పుంజుకుంది. ఒక్కో వారం గడుస్తున్న కొద్దీ హౌస్ మేట్స్ లో ఉండేవాళ్లలో ఉద్వేగాలు బయటపడుతున్న కొద్దీ షో మరింత ఇంట్రస్టింగ్ గా తయారవుతోంది. ఈసారి కంటెస్టెంట్లలో గ్లామర్ పరంగా మెయిన్ అట్రాక్షన్ తేజస్వి మాదివాడ. ఇంతకుముందు కేరింత - రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీమ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ భామ షో మొదటి నుంచి అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది.

తేజస్వి బిగ్ బాస్ షో ఉన్నప్పటికి తన తరఫున సోషల్ మీడియాలో అప్పుడే క్యాంపెయిన్ మొదలెట్టేసింది. తేజస్వికి ఓటింగ్ వేయాలంటూ ఫ్యాన్స్ కు ఆమె ఫాలోయర్లకు రిక్వెస్టులు వచ్చేస్తున్నాయి. బిగ్ బాస్ ఈ షోలో పాల్గొనే వాళ్లకు హౌస్ లోకి వెళ్లిన తరవాత బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్లు చెప్పాలనుకున్నది చెప్పడమూ కుదరదు. అయినా తేజస్వి ఇక్కడే ముందుచూపుతో వ్యవహరించింది. తను షోకు వెళ్లేటప్పుడే తన ట్విట్టర్ అకౌంట్ ను ఓ ఏజెన్సీకి అప్పగించింది. వాళ్లు ఎఫ్పటికప్పుడు తేజస్వికి మద్దతుగా పోస్టింగులు పెడుతూనే ఉన్నారు.

‘‘బిగ్ బాస్ హౌస్ లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అంతుపట్టదు. గ్రూపులో ఉన్నా లేకున్నా కంటెస్టెంట్లందరిలో తేజస్వి అన్ని విషయాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తేజస్వి వ్యక్తిత్వం లోని గొప్పతనం వెల్లడయ్యేందుకు ఆమెకు మద్దతు ఇవ్వండి’’ అంటూ ఆమె ట్విట్టర్ నుంచి తాజా మెసేజ్ వచ్చింది. హౌస్ లో ఉన్న ప్రమోషన్ బాగా ఎలా చేసుకోవాలన్నది తేజస్వి దగ్గరే నేర్చుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు