ఆ విధంగా నానికి పవన్ సాయపడ్డట్టే

ఆ విధంగా నానికి పవన్ సాయపడ్డట్టే

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి విషయంలో మీడియా ఎంత హైపర్ యాక్టివ్ గా రియాక్ట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. జస్ట్.. ఒక మహిళ అయినందుకు ఆమె ఏం చెబితే అవన్నీ నిజమే అన్నట్లుగా కథనాలు.. హాఫెన్నవర్ స్టోరీలు.. గంటలేంటి పూటల కొద్దీ లైవ్ డిస్కషన్స్.. అబ్బో తెలుగు న్యూస్ ఛానల్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

సెమీ న్యూడ్ షో చేయడం.. ఓ రెండు ఫోటోలు చూపించడం మాత్రమే శ్రీరెడ్డి చేసిన హంగామాలో కీలకమైన పాయింట్స్. అవి కూడా ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే దగ్గరైందనే విషయం ఫోటోల్లో అర్ధమవుతోంది. అయితే.. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ విషయంలో తేడా కొట్టేసింది. దాంతో పవన్ చేసిన హంగామా పీక్ స్టేజ్ లో ఉంది. ఇది ఒక రకంగా మీడియా ఛానల్స్ కు డైరెక్ట్ హెచ్చరిక అయిపోయింది. ఫిలిం ఛాంబర్ దగ్గర అప్పటి పవన్ రచ్చ అంతా ఇప్పుడు నానికి బాగా హెల్ప్ అయినట్లుగా కనిపిస్తోంది.

రీసెంట్ గా నాని విషయంలో దారుణమైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. కానీ వీటిని ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా కథనాల రూపంలో వేయలేదు. ఇందుకు కారణం.. ఆమె ఆరోపణలు తప్ప ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపకపోవడమే. ఇదే మీడియా పవన్ నిరసనకు ముందు ఎలా రియాక్ట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. అదే పవన్ ఆ రోజున అలా చేయకపోయి ఉంటే.. ఇవాళ నాని గురించి ఎంతమంది స్వయంప్రకటిత కుహనా మేథావులు ఛానల్స్ కు ఎక్కి పిచ్చపిచ్చగా హంగామా చేసేవాళ్లో కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు