నా నువ్వే.. అన్నీ కుదిరాయ్ కాని

నా నువ్వే.. అన్నీ కుదిరాయ్ కాని

కళ్యాణ్ రామ్ - తమన్నా జంటగా నటించిన మూవీ నా నువ్వే. జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. తొలి టీజర్ ఆరంభం నుంచి జనాల్లో ఆసక్తి కలగచేయడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ కానుండగా.. కళ్యాణ్ రామ్ తన మాస్ ఇమేజ్ కు విభిన్నమైన పాత్రలో కనిపిస్తుండడం.. గెటప్ కూడా కొత్తగా ఉండడం.. హీరోయిన్ తమన్నా కూడా ఇప్పటివరకూ ట్రై చేయని రోల్ లో నటిస్తుండడం మరింతగా ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న నా నువ్వే చిత్రాన్ని.. ముందగా చెప్పినట్లుగానే మే నెల 25న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్కెట్ లో కూడా ఆ సమయానికి వేరే టఫ్ కాంపిటీషన్ ఏదీ లేకపోవడంతో.. నా నువ్వే బాగానే ఫేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి.. టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే కచ్చితంగా కాలేజ్ కుర్రకారు అండ్ యూత్ అనే సమాధానం చెప్పచ్చు.

కానీ సమ్మర్ హాలీడేస్ సీజన్ దాదాపుగా పూర్తయిపోయాక.. చివరి వారంలో వస్తోంది నా నువ్వే. దాదాపుగా అన్ని చోట్లా జూన్ 1 నుంచి స్కూల్స్.. కాలేజెస్ రీఓపెన్ అయిపోతున్నాయి. అంటే నా నువ్వే మూవీకి దాదాపుగా ఒక వారం మాత్రమే అవకాశం ఉంటుంది. కంటెంట్ విపరీతంగా మెప్పిస్తే రెండో వారం తర్వాత కూడా జనాలను రప్పించవచ్చు. కానీ జనాల కాన్సంట్రేషన్ లెవెల్స్ మాత్రం షిఫ్ట్ అయిపోతాయి. మరి ఇలా సీజన్ చివరలో రావాలన్న మేకర్స్ వ్యూహం ఎంతమేరకు ఫలితాన్ని అందించనుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు