పవన్ ఉద్దేశ్యాలు అర్ధం కావు బాబూ

పవన్ ఉద్దేశ్యాలు అర్ధం కావు బాబూ

పవన్ కళ్యాణ్ కు.. సినిమా ఫంక్షన్స్ కు అంతగా పొసగదు అనే చెప్పాలి. తన సినిమా ఫంక్షన్స్ లోనే అంతంతమాత్రమే మాట్లాడే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు కానీ.. సినిమా రంగానికి మాత్రం కాదనే విషయం ఇప్పుడు స్పష్టం అయిపోయింది. కొన్ని రోజుల క్రితం రంగస్థలం సక్సెస్ మీట్ లో పవన్ మాటలు ఎంతగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయో చెప్పాల్సిన పని లేదు.

అయితే.. పవన్ ఒకే రోజున రెండు సినిమా ఫంక్షన్స్ కు అటెండ్ అవుతాడని.. ఏ రోజైనా ఎవరైనా ఊహించారా? కానీ మే 10వ తేదీన అదే జరిగింది. మొదటగా నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా అంటూ రూపొందిన అల్లు అర్జున్ సినిమాకు.. థ్యాంక్యూ ఇండియా మీట్ కు హాజరయ్యాడు పవర్ స్టార్. అక్కడ కాసింత ముక్తసరిగానే మాట్లాడాడు. సినిమా ఫంక్షన్స్ కు వచ్చిన గెస్టులు.. ఆ మూవీ వ్యక్తులను ఎలా ఓ ఫార్మాట్ ప్రకారం పొగుడుతారో.. అదే విధంగా మాట్లాడాడు పవన్. తన కుటుంబానికి చెందిన వ్యక్తుల వేడుకే అయినా ఇబ్బందిగానే కదిలాడు పవన్.

అయితే.. ఓ గంట తర్వాత నేల టికెట్ ఆడియో ఫంక్షన్ లో మాత్రం పవన్ విపరీతమైన సరదాగా గడిపాడు. రవితేజతో జోకులు వేసుకుంటూ ఆద్యంతం ఎంజాయ్ చేశాడు. స్టేజ్ పై కూడా వీరిద్దరి సందడి బాగుంది. అందరినీ ఆకట్టుకుంది. దీంతో కొంతమంది ఫ్యామిలీ ఈవెంట్ లో ముభావంగా ఉండడం.. రవితేజ ఫంక్షన్ లో పవన్ సందడి చేయడాన్ని పాయింట్ చేస్తున్నారు. ఏంటో పవన్ ఎక్కడ ఎలా ఉంటాడో.. ఆయన ఉద్దేశ్యాలు ఏంటో అర్ధం కావని అంటున్నారు.

సొంత ఫ్యామిలీ మెంబర్స్ ను పొగుడుకోవడం అంటే నిజానికి ఇబ్బందిగానే ఉంటుంది. పవన్ లాంటి వ్యక్తులకు ఇది మరీ ఇబ్బంది కలిగించే విషయం. అందుకే అక్కడ ఎంతవరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడగలిగాడు. ఇక రవితేజతో పవన్ స్నేహం ఈ నాటిది కాదు.. తను నటించడం మొదలుపెట్టక ముందు నుంచి రవితేజతో పరిచయం ఉందని పవన్ స్వయంగా చెప్పాడు. సో.. ఆ స్నేహమే పవన్ ప్రవర్తనలో ఇంత తేడా కనిపించడానికి అసలు కారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు