చరణ్‌ పార్టీలతో అతని పని ఆగిపోయింది

చరణ్‌ పార్టీలతో అతని పని ఆగిపోయింది

'రంగస్థలం' రిలీజ్‌ సందర్భంగా ఒక వారం రోజుల పాటు విరామం కావాలని రామ్‌ చరణ్‌ చెప్పడంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ వాయిదా వేసారు. విడుదలకి మూడు రోజులు అటు, మూడు రోజులు ఇటు గ్యాప్‌ కావాలనేది చరణ్‌ రిక్వెస్ట్‌ అట. అయితే రంగస్థలం తన ఊహలకి మించిన విజయం సాధించడంతో చరణ్‌ ఆ సక్సెస్‌ కిక్‌ నుంచి బయటకి రాలేకపోతున్నాడు. అదే పనిగా వరుసగా పార్టీలు చేసుకుంటూ, చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనలు వేస్తూ విజయానందాన్ని ఆస్వాదిస్తున్నాడు. వారం రోజుల్లో అయిపోతుందని అనుకున్నది కాస్తా సెలబ్రేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. గురువారం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జరగబోతున్నాయి. మరి దాంతో అయినా చరణ్‌ రంగస్థలం మూడ్‌ నుంచి బయటకి వచ్చి తదుపరి చిత్రానికి సమయం కేటాయిస్తాడా అనేది చూడాలి.

బోయపాటి చిత్రాన్ని ఆగస్టులోగా పూర్తి చేయాలనే డెడ్‌లైన్‌ వుంది. ఆగస్టు నుంచి రాజమౌళి తీసే వర్క్‌ షాప్‌ కోసం రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వెళ్లాల్సి వుంటుంది. ఇంతవరకు బోయపాటి చిత్రానికి సరిగ్గా ఒక వారం రోజులు కాల్షీట్లు ఇవ్వని రామ్‌ చరణ్‌ ఇక ఎప్పటికి రంగస్థలం సక్సెస్‌ హేంగోవర్‌ నుంచి బయటకి వస్తాడో, ఎప్పట్నుంచి బోయపాటి చిత్రానికి ఫుల్‌ టైమ్‌ కేటాయిస్తాడో మరి. జనవరి నుంచే షూటింగ్‌ పెట్టుకోమని బోయపాటిని లాక్‌ చేసిన చరణ్‌ అప్పట్నుంచీ రంగస్థలంతోనే బిజీగా వుండిపోయాడు. చరణ్‌ రాకపోవడంతో ఒక షెడ్యూల్‌లో హీరో లేకుండానే షూటింగ్‌ ఫినిష్‌ చేసేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు