నాని వదిన.. సమంతకు దయ్యంగా

నాని వదిన.. సమంతకు దయ్యంగా

ఒకప్పుడు కథానాయికగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ బడా స్టార్లు చాలామందితో నటించింది భూమిక. కథానాయికగా బాగానే అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆమె పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది.

కొన్నేళ్ల పాటు ఆమె లైమ్ లైట్లోనే లేదు. ఐతే ఇటీవలే ‘ఎంసీఏ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది భూమిక. ఆ సినిమా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. దీంతో ఈ తరహా క్యారెక్టర్లతో మరిన్ని అవకాశాలు భూమిక తలుపు తడుతున్నట్లు సమాచారం.

తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భూమికి అవకాశం దక్కించుకుంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో భూమిక నటించనుంది. ఇది కన్నడలో విజయవంతమైన ‘యు టర్న్’కు రీమేక్. మాతృకను రూపొందించిన పవన్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో భూమిక దయ్యం పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఆ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. ఒక రోడ్డుపై యు టర్న్ దగ్గర వరుసగా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తుంటాయి. దాని వెనుక ఆసక్తికర కారణం ఉంటుంది. ఆ కారణమేంటో కథానాయిక వెలికి తీస్తుంది. ఆ నేపథ్యంలోనే ‘యు టర్న్’ నడుస్తుంది. ఇది ఒక హార్రర్ బేస్డ్ డిఫరెంట్ స్టోరీ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు