అలా తారక్ కరిగిస్తున్నాడు

అలా తారక్ కరిగిస్తున్నాడు

టాలీవుడ్ టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మన టెక్నీషియన్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. కొత్త టెక్నాలజీని బట్టి సినిమాలో సన్నివేశాలను తెరకెక్కించడం వరకు వచ్చింది. ముఖ్యంగా హీరోల మార్కెట్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. పరబాష వారు కూడా మన హీరోల స్టయిలిష్ లుక్ కి ఫిదా అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా బాడీ పెంచడం కూడా హీరోలకు బాగా కలిసొస్తోంది.

ఓ 15 ఏళ్ల క్రితం మన హీరోలు ఉండే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాను రాను ఆ స్టైల్ మారింది. మన హీరోలు కూడా ట్రెండ్ కు తగ్గట్టు చేంజ్ అవుతున్నారు. ముఖ్యంగా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి మార్పు కోసమైనా కష్టపడాలి. అందుక తగ్గట్టుగా ఇప్పుడు ఎన్టీఆర్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో ఎన్టీఆర్ లుక్ సరికొత్తగా అనిపించాలని కొంచెం వెయిట్ లాస్ అవ్వమని దర్శకుడు త్రివిక్రమ్ తెలియజేశాడట. దీంతో తారక్ ప్రముఖ బాలీవుడ్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో సన్నాహకాలు చేస్తున్నాడు. రీసెంట్ గా తారక్ కి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ చాలా సన్నబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్కవట్లు ఇంకా చాలా చేయాలంటూ ఇప్పుడు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తోన్న ఎన్టీఆర్ వీడియో ని కోచ్ స్టీవెన్ విడుదల చేశాడు. ఇక తారక్ ఎంతగా కష్టపడుతున్నాడో ఆ వీడియో చూస్తే క్లియర్ గా అర్ధమవుతుంది. వెయిట్ లాస్ తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నాడట తారక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు