లేడీ డైరెక్టర్ తో అక్కినేని వారసుడు

లేడీ డైరెక్టర్ తో అక్కినేని వారసుడు

సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ నాగ చైతన్య కెరీర్ బాగానే నడుస్తోంది. 2017 లో రారండోయ్ వేడుక చూద్దాం తో హిట్ అందుకున్న ఈ అక్కినేని వారసుడు యుద్ధం శరణం తో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. మరి 2018 లో చైతు ఎం చేయబోతున్నాడు?

సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు చై చేతిలో ఉన్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సవ్యసాచి పై బాగానే అంచనాలు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ లో ఏ లోటు రనివ్వని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి శైలజ రెడ్డి అల్లుడు కూడా హిట్ అవ్వచ్చని ఫాన్స్ నమ్మకం. చైతన్య ఇప్పటికే శివ నిర్వాణ ప్రాజెక్ట్ కి యెస్ చెప్పాడని అందులో సమంత హీరోయిన్ అని న్యూస్. ఇపుడు చైతన్య ఒక లేడీ డైరెక్టర్ తో చేతులు కలపనున్నాడట. సౌజన్య అనే కొత్త డైరెక్టర్ తో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడు. శైలజ రెడ్డి అల్లుడు ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమా ను కూడా నిర్మిస్తోంది. ఈ సినిమా ఈ సంవత్సరం ఆఖరున సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రారండోయ్ వేడుక చూద్దాం లో చైతు కారెక్టర్ కి చుక్కలు చూపించిన భ్రమరాంబ అదేనండి రకుల్ ప్రీత్ సింగ్ ఏ ఇందులో కూడా హీరోయిన్ గా చైతన్య తో జత కడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English