వాళ్ళు గడ్డిపోచలే.. శ్రీయ కాదు..

వాళ్ళు గడ్డిపోచలే.. శ్రీయ కాదు..

మోహ‌న్ బాబు కాస్త ముక్కుసూటి మ‌నిషి... మ‌న‌సులో ఏముంటే అది చెప్పేస్తారు. ఎవరినైనా విమ‌ర్శించినా అదే తీరు... పొగిడినా అదే తీరు. త్వ‌ర‌లో ఆయ‌న చేసిన గాయ‌త్రి సినిమా విడుద‌ల కాబోతోంది... అందులో శ్రియ హీరోయిన్‌. ఆమె గురించి ఓ ఇంట‌ర్య్వూలో తెగ పొగిడేశారు కలెక్ష‌న్ కింగ్‌.

దాదాపు రెండేళ్ల త‌రువాత గాయ‌త్రి సినిమాలో న‌టించారు మోహ‌న్ బాబు. ఈ సినిమాలో అత‌ని పెద్ద కొడుకు మంచు విష్ణు, శ్రియా, నిఖిలా విమ‌ల్, అన‌సూయ‌, బ్ర‌హ్మానందం కూడా న‌టించారు. కాగా మంచు విష్ణు-శ్రియా దంప‌తులుగా క‌నిపించ‌బోతున్నారు. అయితే శ్రియా అద్భుతంగా చేసింద‌ని, ఆ పాత్ర ఆమె మాత్ర‌మే చేయ‌గ‌ల‌దు అనిపించింద‌ని అన్నారు మోహ‌న్ బాబు. తాను ప‌రిచ‌యం చేసిన ఎంతో మంది హీరోయిన్లు ఉన్నార‌ని.. వాళ్లిప్పుడు బ‌య‌ట ఎంతో ఫోజులు కొడుతున్నార‌ని, నేను వాళ్ల‌ని గ‌డ్డిపోచ‌తో స‌మానంగా చూస్తాన‌ని చెప్పారు. కానీ శ్రియను తాను ప‌రిచ‌యం లేద‌ని, కేవ‌లం త‌మ బ్యాన‌ర్‌లో న‌టించింద‌ని అయినా ఆ అమ్మాయి ఎంతో చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మొన్న‌టికి మొన్న ప‌బ్లిక్‌లో శ్రియ‌ను పొగిడేసిన మోహ‌న్ బాబు... ఇప్పుడు ఇంట‌ర్వ్వూలోనూ తెగ పొగిడేశారు.

ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. గాయ‌త్రి ఏం చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు