ఆ సినిమా హిట్టని దిల్ రాజు డిక్లేర్ చేశాడు

ఆ సినిమా హిట్టని దిల్ రాజు డిక్లేర్ చేశాడు

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. గత ఏడాది తెలుగులో అత్యధిక సినిమాలు నిర్మించింది.. ఎక్కువ హిట్లు కొట్టింది కూడా ఆయనే. అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుటే ఇప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ ప్రొడ్యూసర్ ఆయనే అనడంలో సందేహం లేదు. అలాంటి నిర్మాత మరో నిర్మాణ సంస్థను ఆకాశానికెత్తేశాడు. తనను మించిన నిర్మాతలు వాళ్లని పొగిడేశాడు. ఆయన ప్రశంసలు కురిపించింది ‘యువి క్రియేషన్స్’ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీల గురించే. వీరి నిర్మాణంలో వచ్చిన ‘భాగమతి’ నిఖార్సయిన హిట్ అని రాజు తీర్మానించాడు.

ఈ రోజుల్లో సినిమాల ఫలితం వీకెండ్లోనే తేలిపోతోందని.. ఈ వీకెండ్ రోజుల్లో సోమవారం వసూళ్లు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టే సినిమా ఫలితమేంటో తేలిపోతోందని.. ‘భాగమతి’ సినిమాకు సోమవారం మధ్యాహ్నం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయని.. సోమవారం ఈ చిత్రం రూ.1.8 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని.. దీన్ని బట్టే ఈ సినిమా సూపర్ హిట్ అని కచ్చితంగా చెప్పొచ్చని రాజు అన్నాడు.

యువి క్రియేషన్స్ నిర్మాతల్ని చూస్తే తనను తాను చూసుకున్నట్లు ఉంటుందని.. తాను తీసిన తొలి ఆరు సినిమాల్లో ఐదు సూపర్ హిట్టని.. ‘యువి’ వాళ్లు తీసిన తొలి ఆరు సినిమాల్లోనూ ఐదు సూపర్ హిట్టని.. ఐతే తాను తెలుగులో మాత్రమే సినిమాలు తీస్తుంటే.. యువి వాళ్లు మాత్రం వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన కంటే ముందున్నారని రాజు కితాబివ్వడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు