మనసుంటే ఆపేయమన్న గ్యాంగ్ డైరెక్టర్

మనసుంటే ఆపేయమన్న గ్యాంగ్ డైరెక్టర్

సినిమా పైరసీ అనే విషయం మరీ మితిమీరిపోతోంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పటి అడ్వాన్సడ్ టెక్నాలజీ పుణ్యమా అని.. పరిస్థితి చెయ్యి జారిపోతోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే.. రిలీజ్ రోజునే సినిమాను ఆన్ లైన్ లో పెట్టేస్తున్న తమిళ్ రాకర్స్.. అక్కడి పరిశ్రమను కన్నీళ్లు పెట్టించేస్తోంది.

కొత్త సినిమా రిలీజ్ అవడం ఆలస్యం.. అదే రోజు మధ్యాహ్నాని కల్లా నెట్ లో పెట్టేస్తున్నారు తమిళ్ రాకర్స్. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన సినిమాలన్నీ ఇప్పటికే నెట్ లోకి వచ్చేశాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. తెలుగులో గ్యాంగ్ అంటూ రిలీజ్ అయిన సూర్య మూవీ తానా సేరేంద్ర కూట్టం దర్శకుడు విఘ్నేష్ శివన్.. ఈ పైరసీదారులకు ఓ విన్నపం చేశాడు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. ఈ పైరసీ ప్రింట్ ప్రభావం వసూళ్లపై బాగానే ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో తన గుండె బద్దలైపోయినంత పనైందని అంటున్నాడు విఘ్నేష్ శివన్. మొత్తం తమిళ సినీ పరిశ్రమ అంతా ఏకతాటిపైకి వచ్చినా ఈ తమిళ్ రాకర్స్ ను నిలువరించలేకపోవడం గమనించాలి.

'మీకు మనసు.. గుండె ఉంటే.. వాటిని ఒకసారి ఉపయోగించండి' అంటూ తమిళ్ రాకర్స్ అడ్మిన్ కు సోషల్ మీడియా ద్వారా సూచించాడు విఘ్నేష్ శివన్. అనేక రకాల ట్యాక్స్ ఇష్యూస్.. ఇండస్ట్రీ ప్రాబ్లెమ్స్ ను అధిగమించి ఈ సినిమాను రూపొందించామని.. ఇలా చేయడం సరికాదని అంటున్నాడు విఘ్నేష్ శివన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు