పాస్ పోర్టు పై కేంద్ర షాకింగ్ నిర్ణ‌యం?

పాస్ పోర్టు పై కేంద్ర షాకింగ్ నిర్ణ‌యం?

విద్య‌, వినోదం, విహారం, ఉద్యోగం, వ్యాపారం....ఇలా అవ‌స‌ర‌మేదైనా విదేశీయానం చేయాలంటే త‌ప్ప‌నిసరిగా పాస్ పోర్టు ఉండాల్సిందే. గ‌తంలో మాదిరి కాకుండా ఇపుడు పాస్ పోర్టు సేవా కేంద్రాలలో కూడా పాస్ పోర్టుల వెరిఫికేష‌న్ జ‌రుగుతుండ‌డంతో  ఆ ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీయానంతో పాటు స్వ‌దేశంలో అడ్ర‌స్ ప్రూఫ్ గా కూడా పాస్ పోర్టు అక్క‌ర‌కు వ‌స్తోంది. అయితే, ఇక‌పై పాస్ పోర్టులు....చిరునామా ను వెరిఫై చేసేందుకు ప‌నికి రావ‌న్న సంకేతాల‌ను కేంద్రం ఇస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇకపై పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను రాయ‌కుండా స‌రికొత్త నిబంధ‌న విధించాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన‌ట్లు తెలుత‌స్తోంది.

ఒక‌వేళ కేంద్రం విధించిన స‌రికొత్త నిబంధ‌న అమ‌లులోకి వ‌స్తే.....ఇక‌పై పాస్ పోర్టులు అడ్రస్‌ ప్రూఫ్ లుగా పనికి రావు. ఇక‌పై జారీ కాబోయే పాస్‌పోర్టులకు కొత్త నిబంధ‌న అమ‌లుచేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పాత పాస్ పోర్టుల వ్యాలిడిటీ ఉన్నంత‌వ‌ర‌కు వాటిని  వినియోగించుకోవచ్చని ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్‌(న్యాయ విభాగం) తెలిపారు. రెన్యువల్‌ సమయంలో కొత్త‌ మార్పులు వర్తిస్తాయన్నారు.

పాస్ పోర్టు రంగును కూడా మార్చే ఉద్దేశంలో కూడా ఎంఈఏ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నీలి రంగు పాస్ పోర్టులు జారీ చేయబోతున్నారని సమాచారం. అయితే, ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు