చైతన్య సినిమాకి భలే టాక్‌

చైతన్య సినిమాకి భలే టాక్‌

ఇటీవలే పెళ్లి చేసుకున్న నాగ చైతన్య వెంటనే తన సినిమా పనుల్తో బిజీ అయిపోయాడు. చైతన్య కానీ, సమంత కానీ పెళ్లి తర్వాత హాలిడే తీసుకోకుండా, హనీమూన్‌కి వెళ్లకుండా తాము ఒప్పందం చేసుకున్న సినిమాలకి ఆటంకం రాకుండా చూసుకుంటున్నారు. చైతన్య తదుపరి చిత్రం 'సవ్యసాచి' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో సూపర్‌ టాక్‌ వినిపిస్తోంది. 'కార్తికేయ' లాంటి విభిన్నమైన థ్రిల్లర్‌ని అందించిన చందు మొండేటి ఆ తర్వాత చైతన్య ఒత్తిడిపై 'ప్రేమమ్‌' రీమేక్‌ చేసాడు. అది విజయవంతం అయింది కానీ చందుకి తన సొంత కథలు చెప్పడమే ఇష్టమట. సవ్యసాచి చిత్రానికి అతను బ్రహ్మాండమైన కథ రాసాడట. మామూలుగా ఏ సినిమాని అంత త్వరగా ఓకే చేయని మాధవన్‌ కూడా చందు చెప్పిన కథకి ఫిదా అయిపోయి ఇందులో ఒక ముఖ్య పాత్ర చేయడానికి అంగీకరించాడు.

ఈ చిత్రంలో మాధవన్‌ చేస్తున్నదేంటో చూపించాలని తహతహగా వుందని నాగచైతన్య కూడా అన్నాడు. చైతన్య గత చిత్రం యుద్ధం శరణం చాలా పెద్ద ఫ్లాప్‌ అయింది. లవర్‌బాయ్‌ పాత్రలకి తప్ప మిగతా వాటికి సూట్‌ అవడనే ముద్ర పడింది. కానీ ఈ చిత్రంతో చైతన్య 'సవ్యసాచి' అనిపించుకుంటాడని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు