‘గరుడవేగ’ లాభాలు తెచ్చేసింది

‘గరుడవేగ’ లాభాలు తెచ్చేసింది

రూ.25-రూ.30 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిందన్నారు ‘గరుడవేగ’ సినిమా. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు నుంచి కలెక్షన్లు బాగా పుంజుకున్నప్పటికీ ఈ సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందా అన్నది సందేహంగానే ఉంది. థియేట్రికల్ రన్ ద్వారా సగం బడ్జెట్ రికవర్ కావడం కష్టమే అన్నట్లుంది పరిస్థితి.

ఐతే తెలుగు రాష్ట్రాల సంగతేమో కానీ.. యుఎస్‌లో మాత్రం ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ ఈ సినిమా ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లు సమాచారం.

‘గరుడవేగ’ యుఎస్ హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. ఆ మొత్తం రూ.36 లక్షలని సమాచారం. ఐతే యుఎస్ తెలుగు ప్రేక్షకులు మెచ్చే క్లాస్ థ్రిల్లర్ కావడం.. టాక్ కూడా ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో అక్కడ అంచనాల్ని మించి వసూళ్లు వచ్చాయి. ప్రిమియర్స్ కలిపి రెండు రోజులకే 2 లక్షల డాలర్ల మార్కును దాటింది ఈ సినిమా. శనివారం ఒక్క రోజే లక్షల డాలర్లకు పైగా వసూలయ్యాయి.

ఆదివారం వసూళ్ల లెక్క తేలాల్సి ఉంది. ఐతే మూడో రోజు ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా నిలబడితే.. అక్కడ మంచి లాభాలు అందుకునే అవకాశముంది. ఐతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా సేఫ్ జోన్లోకి రావడం కష్టమే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు