అల్లు వారిని నమ్మి మూడేళ్లు ఉంటే..

అల్లు వారిని నమ్మి మూడేళ్లు ఉంటే..

బుల్లితెరపై బహుముఖ ప్రజ్న చూపించిన ప్రభాకర్.. వెండితెర మీదా తానేంటో రుజువు చేసుకోవాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. నటుడిగా అతడికి పెద్ద బ్రేక్ రాకపోయినా.. దర్శకుడిగా మారాలని అతను గట్టి ప్రయత్నాలే చేశాడు. అతను అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాతను మెప్పించడం.. ఆయన నిర్మాణంలో సినిమా చేసేందుకు ఒప్పించడం విశేషమే.

ఐతే ముందు శిరీష్ హీరోగా తన సొంత కథతో సినిమా చేయాలని అనుకున్నాడట ప్రభాకర్. కానీ అనుకోని విధంగా వ్యవహారం మలుపు తిరిగి.. ఆది సాయికుమార్ హీరోగా ఒక రీమేక్ సినిమా మూవీ చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ తెలిపాడు.

‘‘ముందు నేను బన్నీ వాసు గారికి నేను రాసుకున్న సొంత కథ చెప్పాను. కానీ ఆయన ఓ తమిళ సినిమాను రీమేక్ చేద్దామంటూ.. ‘యామిరిక్కు భయమే’ చూపించారు. దర్శకుడిగా తొలి సినిమానే రీమేక్ ఏంటి అనుకున్నా. కానీ సినిమా చూశాక చేద్దామనిపించింది. తర్వాత అల్లు అరవింద్ గారిని కలిశాను.

ఆయన సెకండాఫ్ కొద్దిగా మార్చమని.. నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయమని చెప్పారు. ఇందుకోసం ఆయన నాకో రచయితను కూడా ఇచ్చారు. కానీ అతడితో నాకు సింక్ కాలేదు. దీంతో నేనే సొంతంగా రాస్తానని చెప్పాను. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నిజానికి ఈ కథను అల్లు శిరీష్‌తో చేద్దామని కూడా అనుకున్నాం. కానీ అతను తాను నటించనని.. ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే ఓకే అని అన్నాడు. ‘నెక్స్ట్ నువ్వే’ రెండేళ్ల కిందటే తెరకెక్కాల్సింది. కానీ రీమేక్ హక్కుల విషయంలో గొడవ వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. మొత్తంగా అల్లు అరవింద్ గారి దగ్గర నేను మూడేళ్లు పని చేస్తే.. ఇప్పటికి దర్శకుడిగా మారాను’’ అని ప్రభాకర్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు