తాప్సి సినిమా దుమ్ము దులిపింది

తాప్సి సినిమా దుమ్ము దులిపింది

బాలీవుడ్‌కు వెళ్లాక వరుసగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది సొట్టబుగ్గల సుందరి తాప్సి. ఆ సినిమాల్లో పద్ధతిగా కనిపించినంత కాలం.. సౌత్ సినిమాలు గ్లామర్ చుట్టూనే తిరుగుతాయంటూ తేలిగ్గా మాట్లాడింది. కానీ ఇప్పుడు తాప్సి బాలీవుడ్లో ఇలాంటి గ్లామర్ టచ్ ఉన్న పాత్రే చేసింది.

ఆ సినిమానే.. జుడ్వా-2. ఇందులో తాప్సి బికినీలతో, లిప్ లాక్స్‌తో రెచ్చిపోయిందంతే. శుక్రవారమే రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో వచ్చిన ఎంటర్టైనర్‌గా దీన్ని చెబుతున్నారు. కంటెంట్ రొటీనే అయినప్పటికీ.. ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.

దసరా సీజన్లో పాజిటివ్ టాక్‌తో సినిమా మొదలవడంతో దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు ఈ చిత్రం రూ.15.55 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. వరుణ్ ధావన్ స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తమే. ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ‘జుడ్వా-2’ది నాలుగో స్థానం కావడం విశేషం. 90ల్లో ‘హలో బ్రదర్’కు రీమేక్‌గా వచ్చిన హిందీ సినిమా ‘జుడ్వా’కు సీక్వెల్ ‘జుడ్వా-2’.

తొలి భాగంలో సల్మాన్ లాగే.. ఇందులో వరుణ్ ద్విపాత్రాభినయం చేశాడు. అతడి తండ్రి డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. తాప్సితో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కథానాయికలుగా నటించారు. ఇద్దరూ కూడా అందాల ప్రదర్శనలో పోటీ పడ్డారీ సినిమాలో. తొలి వారాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. ఫుల్ రన్లో రూ.100 కోట్ల క్లబ్బును కూడా అందుకునే అవకాశాలు లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English