సంపూ కెరియర్‌ స్మాష్‌ అయినట్టేనా?

సంపూ కెరియర్‌ స్మాష్‌ అయినట్టేనా?

'బిగ్‌ బాస్‌' షో నుంచి అర్ధాంతరంగా బయటకి వెళ్లిపోయిన సంపూర్ణేష్‌ బాబు తనపై అభిమానులు పెట్టుకున్న అంచనాలని తలకిందులు చేసాడు. బిగ్‌ బాస్‌లో ఎవరెవరు ఆడుతున్నారనేది ప్రకటించినపుడు సంపూ పేరు చూసి ఎక్కువ మంది ఎక్సయిట్‌ అయ్యారు. ఓవర్‌ డైలాగులు చెబుతూ, సైజుకి మించిన బిల్డప్‌ ఇస్తూ హాస్యం పండించే సంపూ 'బిగ్‌బాస్‌'కి హైలైట్‌ అవుతారని అనుకున్నారు.

అయితే మొదటి రోజు నుంచే ఈ షోకి అసలు ప్రిపేర్‌ అవకుండా వచ్చాడనే సంగతి తెలిసిపోయింది. అతి మంచితనం చూపిస్తూ, కామెడీ పండించడం పోయి హీరోలా హుందాగా బిహేవ్‌ చేయడానికి సంపూ ట్రై చేసాడు. 'బిగ్‌ బాస్‌'తో అతని కాన్వర్‌జేషన్స్‌ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించేవి. కొన్ని సార్లయితే అసలు సంపూ అక్కడ వున్నాడా లేదా అని అనుమానం కలిగేంతగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఈ షోకి హైలైట్‌ అవుతాడని, సోషల్‌ మీడియాలో తనకున్న ఫాలోయింగ్‌ హెల్ప్‌ అవుతుందని ఏరి కోరి, భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ షోకి సంపూని తీసుకున్నారు. తీరా పది రోజులు తిరగకుండా నా వల్ల కాదంటూ పారిపోయాడు. అంతే కాదు, పంపించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించాడని, మనకి చూపించని ఫుటేజీలో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఓవర్‌ బిల్డప్‌ డైలాగులతో, సెటైరికల్‌ కామెడీతో తన కంటూ ఒక రకం ఇమేజీ సృష్టించుకున్న సంపూర్ణేష్‌బాబు ఈ షో ద్వారా తనది లిమిటెడ్‌ టాలెంట్‌ అని, క్లాస్టర్‌ఫోబియాని డీల్‌ చేసే స్థయిర్యం కూడా లేవని చాటుకున్నాడు. ఇకపై తన మార్కు హాస్యం చేస్తే నవ్వే వాళ్ల కంటే, బిల్డప్పులు చాలు వెళ్ళెళ్ళవోయ్‌ అనే వాళ్ళే ఎక్కువ వుంటారేమో. బిగ్‌ బాస్‌తో తన పాపులారిటీ పెంచుకుంటాడని అనుకుంటే వున్నది పోగొట్టుకుని వచ్చాడు పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు